ఆ ముసలాయనపై నమితకు అంత ఇంట్రెస్ట్ ఏంటో..!

Published : Oct 14, 2017, 02:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఆ ముసలాయనపై నమితకు అంత ఇంట్రెస్ట్ ఏంటో..!

సారాంశం

బొద్దుగుమ్మ నమితకు సీనియర్ నటుడు శరత్ కుమార్ కు ఏంటి సంబంధం? గత కొంత కాలంగా శరత్ బాబుతో రిలేషన్ షిప్ లో వుందని కోడై కూస్తున్న చెన్నై మీడియా రూమర్స్ అని కొట్టిపారేయలేని విధంగా నమిత వ్యవహారశైలి

సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గుజరాతీ భామ నమిత, వచ్చిన కొత్తలో నాజూకుగా ఉండేది. క్రమంగా బొద్దుగా తయారవడంతో ఆమె టాలీవుడ్‌కు కొంచెం దూరమైంది. అయితే తమిళ తంబీలు బొద్దుగా ఉండే హీరోయిన్లు అంటేనే ఇష్టపడతారు కాబట్టి ఆమెకు కోలీవుడ్ లో బ్రహ్మరంథం పట్టారు. ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టారు. సీనియర్ నటి ఖుష్బూ తర్వాత అలా గుడికట్టి ఆరాధించిన కథానాయిక నమితనే.

 

నమితకు ఇటీవల కాలంలో అక్కడ కూడా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తానంటూ నమిత హడావుడి కూడా చేసింది. అయితే, ఇంత వరకు ఏ పార్టీలో చేరలేదు. కమల్‌హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నా చివరి వరకు నిలబడలేకపోయింది.



ఇప్పుడు నమిత గురించి ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత ప్రేమ వ్యవహారం నడుపుతోందనేదే ఆ టాక్. వినడానికి ఛండాలంగా ఉన్నా... ఇది నిజమేనంటోది టీనగర్. ఈ మధ్య కాలంలో శరత్‌ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తోంది. తన రెండు పెళ్లిళ్లు పెటాకులైపోయాయని... ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఓ హీరోయిన్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆ హీరోయిన్ నమితే అంటూ తమిళ సినీ జనాలు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్‌బాబు‌తో నమిత బంధం ఎంతకాలమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్