సీఎం జగన్ పై కామెంట్స్.. వెనక్కి తగ్గిన భీమ్లా నాయక్ నిర్మాత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 08:02 PM IST
సీఎం జగన్ పై కామెంట్స్.. వెనక్కి తగ్గిన భీమ్లా నాయక్ నిర్మాత

సారాంశం

సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన మరో చిత్రం డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన మరో చిత్రం డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. దీనితో సితార బ్యానర్ లో మరో హిట్ పడిందని అంటున్నారు. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భీమ్లా నాయక్ రిలీజ్ ఎప్పుడు అని మీడియా ప్రతినిధులు అడగగా .. ఆవిషయం మీరు జగన్ గారిని అడగాలి. 50 శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు ఎత్తివేస్తే అప్పుడే రిలీజ్ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ అయ్యాయి. 

ఈ వ్యాఖ్యలపై నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. జగన్ గారిని అడగాలి అంటే నా ఉద్దేశం వేరు అని.. మాట ఆ సందర్భంలో అలా వచ్చింది అని నాగవంశీ అన్నారు. ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు ఎత్తివేసినప్పుడు రిలీజ్ అని చెప్పబోయా, ప్రభుత్వం కోవిడ్ రూల్స్ ఎప్పుడు ఎత్తివేస్తే అప్పుడు రిలీజ్ అనేది మాత్రమే తన మాటల్లోని అర్థం అని నాగవంశీ అన్నారు. 

కానీ నేను అన్న మాట మాత్రమే వివాదంగా మారిపోయింది అని నాగవంశీ తెలిపారు. ఏది ఏమైనా కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయం చూసుకునే భీమ్లా నాయక్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నాగవంశీ అన్నారు. ఒక వేళ ఫిబ్రవరి 25న కుదరకపోయినా ఏప్రిల్ 1న రిలీజ్ ఉంటుందని అన్నారు. అప్పటికి ఆర్ఆర్ఆర్ రిలీజై వారం రోజులు గడుస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్