Hero Suriya: ఫస్ట్ టైం తెలుగులో షురూ చేసిన సూర్య.. ఫ్యాన్స్ కి పండగే ఇక

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 06:55 PM IST
Hero Suriya: ఫస్ట్ టైం తెలుగులో షురూ చేసిన సూర్య.. ఫ్యాన్స్ కి పండగే ఇక

సారాంశం

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. 

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భీకరంగా, ధైర్యంగా ఉండేవాడు అనే అర్థంవచ్చేలా టైటిల్ పెట్టారు. సో ఈ మూవీలో సూర్య మాస్ విశ్వరూపం చూడొచ్చు. 

ఇదిలా ఉండగా ఈ మూవీని త్వరలో విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.  సూర్యకి జోడిగా నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ చిత్రం నుంచి సూర్య తెలుగు అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. తొలిసారి సూర్య ET చిత్రంలో తనకు తానే తెలుగు డబ్బింగ్ చెబుతున్నాడు. 

సో తెలుగు అభిమానులు ఇక పండగ చేసుకోవచ్చు. సూర్య పవర్ ఫుల్ డైలాగులని ఆయన వాయిస్ లోనే వినొచ్చు. సూర్య నుంచి మాస్ మూవీ వచ్చి చాలా రోజులే అవుతోంది. దీనితో ET కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

సూర్య చివరగా నటించిన రెండు సినిమాలు కథా బలమున్న సినిమాలే. మాస్ మూవీస్ కాదు. ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్నాయి. 

జై భీం చిత్రం ఆస్కార్ బరిలో ఉంటుందని అభిమానులంతా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం ఆస్కార్స్ కి నామినేట్ కాలేకపోయింది. కానీ అందరి హృదయాల్ని మాత్రం ఆ మూవీ గెలుచుకుంది. లాయర్ చంద్రు పాత్రలో సూర్య స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా