Extra Jabardasth : సుడిగాలి సుధీర్‌ రాత్రి రహస్యాలు బయటపెట్టిన పోలీసులు.. అసలు విషయం తెలియడంతో షాకైన రష్మీ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 06:02 PM ISTUpdated : Feb 12, 2022, 06:11 PM IST
Extra Jabardasth : సుడిగాలి సుధీర్‌ రాత్రి రహస్యాలు బయటపెట్టిన పోలీసులు.. అసలు విషయం తెలియడంతో షాకైన రష్మీ..

సారాంశం

సుడిగాలి సుధీర్ తన రాత్రి రహస్యాలను బయటపెట్టాడు. పోలీసులు అడిగే ఒక్కో ప్రశ్నకు సుధీర్ ఇచ్చే ఆన్సర్ నెటిజన్లను షాక్ కు గురిచేస్తున్నాయి.  అసలు నిజం యాంకర్ రష్మీ గౌతమ్ కు తెలియడంతో షాక్ కు గురైంది. అసలేం జరిగిందంటే..         

తొమ్మిదేండ్ల నుంచి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను నవ్విస్తూ కామెడీ షోల్లో ప్రత్యేకతను సంపాదించుంకుంది ‘ఎక్స్ ట్రా జబర్దస్’. తొలుత ‘జబర్దస్త్’ గా ఈ కామెడీ షోను ప్రారంభించిన ‘మల్లేమాల’ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఆ మరుసటి ఏడాదే ఎక్స్ ట్రా జబర్దస్ ను కూడా ప్రారంభించారు. టీంలోని సీనియర్ , జూనియర్ ఆర్టిస్టులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఈ షోను రన్ చేస్తున్నారు. జబర్దస్ లో ‘హైపర్ ఆది రైజింగ్ రాజు’టీం,  అదిరే అభి, చలాఖీ చంటి, రాకేట్ రాఘవ, వెంకీ మంకీస్ మరియు తాగుబోతు రమేశ్ టీంలు కొనసాగుతున్నాయి.  

కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ స్పెషల్ స్కిట్ లో పర్ఫార్మ్ చేశారు. సుధీర్ ను రష్మీ గౌతమ్ ఇంటరాగేషన్  చేస్తూ స్టేజ్ పై హంగామా సృష్టించింది. సుధీర్ ఇచ్చే ఆన్సర్స్ ఆకట్టుకుంటున్నాయి.   మరోవైపు బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేష్ టీంలు డిఫరెంట్ స్కిట్లతో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ స్పెషల్ స్కిట్ కనిపించడం ప్రోమోకు ప్రత్యేకతగా నిలిచింది. 

 

 ఈటీవీలో మల్లేమాల ప్రొడక్షన్స్ సమర్పణలో ఈటీవీలో ప్రసారమవుతుంది ‘ఎక్స్ ట్రా  జబర్దస్త్’. తాజా ఈ  కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేసింది మల్లేమాల టీవీ. నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియో ఆసాంతం నవ్వులు పూయిస్తోంది. జడ్జ్ లుగా రోజా, మనో వ్యవహరించగా టీం లీడర్లు సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేష్ తమ స్కిట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రతి టీం నవ్వులు పూయించేందుకు ప్రయత్నించాయి. ఎప్పుడూ కొత్తదనాన్ని చూపించే సుడిగాలి సుధీర్ టీం సరికొత్త స్కిట్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణతో నవ్వులు పూయించారు. పంచులు వేస్తూ పడిపడి నవ్వేలా చేశారు.   

ఈసారి సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ కలిసి ఒక స్పెషల్ స్కిట్ చేశారు.  ఈ స్కిట్ నలుగురు పోలీసులు, రష్మీ గౌతమ్ ‘సుధీర్, బుల్లెట్ భాస్కర్’ను ఇంటరాగేషన్ చేస్తారు. ఇక్కడ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సుధీర్ దిమ్మతిరిగే పోయే ఆన్సర్స్ ఇచ్చారు. మొబైల్ పాస్ వర్డ్ ఏంటనీ రష్మీ గౌతమ్ అడగగా ‘ఉమ్మా’ అని బదులివ్వడం, ఈ మెయిల్ పాస్ వర్డ్ ను అడగగా ‘తొందరగా వచ్చేయ్’ అంటూ సుధీర్ ఇచ్చిన ఆన్సర్స్ ఆకట్టుకుంటున్నాయి. నువ్వు గోడలు ఎందుకు దూసుకుతున్నావు అనే ప్రశ్న కు ‘ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసి ఉండటంతో.. అటు వైపు మూత్రం పోసేందుకు గోడ దూకుతున్నాను’ అంటూ చెప్పే ఆన్సర్స్ నవ్వులు పూయిస్తున్నాయి.  మరోవైపు ఎప్పుడూ వీరి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంటూనే ఉంది. వీరిద్దరూ ఒకే స్కిట్ లో పర్ఫార్మ్  చేసి అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో య్యూటూబ్ లో రెండున్నర మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది.    
 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్