నాగార్జునని టెన్షన్‌ పెడుతున్న `రీమేక్‌` సెంటిమెంట్‌.. `నా సామి రంగ` దాన్ని బ్రేక్‌ చేస్తుందా?

Published : Jan 13, 2024, 11:18 PM IST
నాగార్జునని టెన్షన్‌ పెడుతున్న `రీమేక్‌` సెంటిమెంట్‌.. `నా సామి రంగ` దాన్ని బ్రేక్‌ చేస్తుందా?

సారాంశం

నాగార్జున ఈ ఆదివారం `నా సామి రంగ` మూవీతో రాబోతున్నారు. అయితే ఆయన్ని ఓ విషయం భయపెడుతుందట. `రీమేక్‌` సెంటిమెంట్‌ ని బ్రేక్‌ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.  

కింగ్‌ నాగార్జున `బిగ్‌ బాస్‌ 7` క్లిక్‌ కావడంతో ఆ జోరులో ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతికి `నా సామి రంగ` సినిమాతో వస్తున్నాడు. కంటెంట్‌ చూసుకుని ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. బిజినెస్‌ కూడా బాగానే అయ్యింది. ఓటీటీ డీల్‌ గట్టిగానే సెటిల్‌ అయ్యిందట. సుమారు 18కోట్ల బిజినెస్ అయితే, ముప్పైకోట్లకుపైగా ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యిందట. హాట్‌స్టార్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఓటీటీతో నాగ్‌కి డైరెక్ట్ లింక్‌ ఉండటంతో బాగానే వర్కౌట్‌ చేసినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే సినిమాపై బజ్‌ లేదు, ఈ సినిమా కోసం పెద్దగా ఎదురుచూసే జనాలు కూడా లేరు. `గుంటూరు కారం`, `హనుమాన్‌` ముందు నిలవలేకపోతుంది. ఇప్పటికైతే వాటిని బీట్‌ చేసే హైప్‌ రాలేదు. మరి రిలీజ్‌ తర్వాత వస్తుందేమో చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. దీనికితోడు మరో ముఖ్యమైన విషయం నాగ్‌ని టెన్షన్‌పెడుతుంది. అదే ` రీమేక్‌`. ఇటీవల కాలంలో రీమేక్‌ సినిమాలు ఏదీ ఆడటం లేదు. ఏదో చూట్టేస్తున్నారు. తెలుగులో గత రెండేళ్లలో వచ్చిన రీమేక్‌ సినిమాల్లో ఒకటి రెండు తప్ప మాగ్జిమమ్‌ పరాజయం చెందాయి. 

దీంతో నాగార్జున `నా సామి రంగ`కి కూడా రీమేక్‌ సెంటిమెంట్‌ భయపెడుతుందట. ఆయన లోలోపల చాలా టెన్షన్‌ పడుతున్నారు. రీమేక్ సినిమాలను ఆడియెన్స్ చూడటం లేదనే విషయం ఇటీవల చాలా సినిమాల విషయంలో నిరూపితమైంది. పవన్‌ `బ్రో` మూవీ కూడా అలానే డిజాస్టర్‌ అయ్యింది. మరి నాగార్జున మూవీని చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలోనే మన్మథుడు కాస్త టెన్షన్‌గా ఉన్నాడట. 

దీనికితోడు నెగటివ్‌ ప్రచారం కూడా జరగ్గకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే యూఎస్‌లోనూ ప్రీమియర్స్ లేట్‌గా వేస్తున్నారట. ఏడుగంటల తర్వాతే ప్రీమియర్స్ పడుతున్నట్టు తెలుస్తుంది. దీనిప క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నెగటివ్‌ రాకుండా చాలా మ్యానేజ్‌ చేస్తున్నారట. మార్నింగ్‌ షోలకు, ఓపెనింగ్స్ పై ప్రభావంపడకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఎంత వరకు ఇది వర్కౌట్‌ అవుతుందో చూడాలి. అలాగే రీమేక్‌పై నెలకొన్న సెంటిమెంట్‌ని ఇది బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. అన్నట్టు ఇది మలయాళంలో హిట్‌ అయిన `పొరింజు మరియం జోసే` చిత్రానికి రీమేక్‌. తెలుగులో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?