రవితేజతో `జాతిరత్నం` అనుదీప్‌ మూవీ.. అనౌన్స్ మెంట్‌ వచ్చేది అప్పుడే..?

Published : Jan 13, 2024, 09:37 PM ISTUpdated : Jan 13, 2024, 09:38 PM IST
రవితేజతో `జాతిరత్నం` అనుదీప్‌ మూవీ.. అనౌన్స్ మెంట్‌ వచ్చేది అప్పుడే..?

సారాంశం

మాస్‌ మహారాజా రవితేజ  సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ఆయన కొత్త సినిమా ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. అనుదీప్‌తో మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం. 

మాస్‌ మహారాజా ఈ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. ఒకవేళ వచ్చి ఉంటే అన్ని నలిగిపోయే పరిస్థితి ఉండేది. ఆయన నటించిన `ఈగల్‌` మూవీ ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ హరీష్‌ శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల `మిస్టర్‌ బచ్చన్‌` సినిమాని ప్రారంభించడంతోపాటు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ఇది హిందీలో హిట్‌ అయిన `రైడ్‌`కి రీమేక్‌.

దీంతోపాటు గోపీచంద్‌ మలినేనితో సినిమా చేస్తున్నాడు రవితేజ. `క్రాక్‌` తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న నాల్గో సినిమా ఇది. గతంలో `డాన్‌ శీను`, `బలుపు`, `క్రాక్‌` చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు నాల్గోసారి కలుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది. ఇప్పటికే ప్రారంభై, షూటింగ్‌ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు రవితేజ. 

ఇప్పుడు మరో మూవీని ప్రకటించబోతున్నారు. ఆయన అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. సితార బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుందట. అయితే సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. రేపుగానీ, ఎల్లుండి గానీ ఈ మూవీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలనుకున్నారట. కానీ `గుంటూరు కారం` రిజల్ట్ పరిణామాల నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే రాబోతుందని తెలుస్తుంది. మరి నిజం ఏంటో తెలియాలి. 

ఇదిలా ఉంటే అనుదీప్‌ అంటే కామెడీకి కేరాఫ్. `జాతిరత్నం`తో ఆయన ఏ రేంజ్‌లో నవ్వించారో తెలిసిందే. ఇప్పటికీ కామెడీ సినిమాలు చూడాలంటే ఆ చిత్రాన్ని ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటారు. అలాంటి దర్శకుడితో ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఎనర్జీకి కేరాఫ్‌ అయిన రవితేజ సినిమా అంటే అది నెక్ట్స్ లెవల్‌ కామెడీని ఊహించుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవ ఉండదని చెప్పొచ్చు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఇది రాబోతుందని తెలుస్తుంది. అయితే అనుదీప్‌.. నవీన్‌ పొలిశెట్టితో సినిమా చేయాలనుకున్నారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. దీంతో రవితేజ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. అనుదీప్‌ చివరగా `ప్రిన్స్` మూవీని తెరకెక్కించారు. ఇది డిజప్పాయింట్‌ చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌