చిరంజీవి తిరస్కరించిన కథతో `హనుమాన్‌` హీరో సినిమా.. దర్శకుడు ఎవరంటే?

Published : Jan 13, 2024, 10:50 PM IST
చిరంజీవి తిరస్కరించిన కథతో `హనుమాన్‌` హీరో సినిమా.. దర్శకుడు ఎవరంటే?

సారాంశం

తేజ సజ్జ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు హాట్‌ కేక్‌లా మారుతున్నాడు. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూకట్టే పరిస్థితి రాబోతుంది.

`హనుమాన్‌` సినిమాతో హిట్‌ కొట్టాడు యంగ్‌ హీరో తేజ సజ్జా. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు అందరు హీరోలకు బాలనటుడిగా కనిపించి మెప్పించాడు. ఆల్ రెడీ జనాల్లో బాగా తెలిశాడు. ఇప్పుడు `హనుమాన్‌` మూవీతో సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకొచ్చి సక్సెస్ కొట్టాడు. ఇందులోని హనుమంతుడి ఎలిమెంట్లు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. హనుమంతుడిని చూపించిన విధానం బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కి ఫిదా అవుతున్నారు. 

మొత్తానికి తేజ సజ్జ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు హాట్‌ కేక్‌లా మారుతున్నాడు. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు, దర్శకులు క్యూకట్టే పరిస్థితి రాబోతుంది. ఈ నేపథ్యంలో తేజ నెక్ట్స్‌ ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో ఓ క్రేజీ వార్త ఫిల్మ్ నగర్‌లో వైరల్‌ అవుతుంది. తేజ సజ్జ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ఆయన చిరంజీవి తిరస్కరించిన కథతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.

మెగాస్టార్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఇటీవల దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ప్లాన్‌ చేశారు. ఓ తండ్రి కొడుకుల కథ చెప్పారు. చాలా కాలంగా దీనిపై ట్రావెల్‌ అయ్యారు. అనౌన్స్ మెంట్‌ కూడా వచ్చింది. ఇది మలయాళ మూవీకి రీమేక్‌ అన్నారు. కానీ ఆ తర్వాత అది ఒరిజినల్‌ స్టోరీనే అని తెలిపారు. అయితే ఆ కథ నచ్చకపోవడంతో చిరు తిరస్కరించాడు. దీంతో కళ్యాణ్‌ కృష్ణ బ్యాక్‌ అయ్యాడు. అయితే ఇప్పుడు అదే కథని సినిమాగా చేయబోతున్నారట. తేజ సజ్జాతో ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. 

దీనికి బెజవాడ ప్రసన్న కుమార్‌ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. `ధమాఖా` ఫేమ్‌ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తారట. ఈ మూవీ నుంచి కళ్యాణ్ కృష్ణ తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రసన్న కుమార్‌, త్రినాథరావు కలిసి సెట్‌ చేస్తున్నారట. వీలైతే త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది తండ్రి కొడుకుల కథ. కొడుకుగా తేజ చేస్తే తండ్రిగా ఎవరనేది పెద్ద ప్రశ్న. ఓ సీనియర్‌ హీరో అయితేనే సెట్‌ అవుతాడు. ఆ పాత్ర కోసం వెతుకులాట జరుగుతుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు