`వైల్డ్ డాగ్‌` నుంచి ఫ్యాన్స్ కి గిఫ్ట్ రెడీ చేస్తున్న నాగార్జున.. ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్

Published : Mar 07, 2021, 06:01 PM ISTUpdated : Mar 07, 2021, 06:04 PM IST
`వైల్డ్ డాగ్‌` నుంచి ఫ్యాన్స్ కి గిఫ్ట్ రెడీ చేస్తున్న నాగార్జున.. ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్

సారాంశం

నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్ నేపథ్యంలో ఈ సి నిమా రూపొందుతుంది. తాజాగా తన ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు నాగార్జున. ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.

నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్‌, దియా మీర్జా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్, టెర్రరిస్ట్ ల నేపథ్యంలో ఎన్‌ఐఏ ఇన్వెస్టిగేషన్‌ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా తన ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు నాగార్జున. ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 12న, సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 2న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున విజయ్‌ వర్మ అనే ఆపరేషన్‌ టీమ్‌ లీడర్‌గా, వైల్డ్ డాగ్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. 

నాగార్జున నటించిన చిత్రాలు ఇటీవల పరాజయం చెందాయి. ఎన్నో ఆశలతో చేసిన `మన్మథుడు 2` డిజప్పాయింట్‌ చేసింది. దీంతో `వైల్డ్ డాగ్‌`పై చాలా హోప్స్ తో ఉన్నారు నాగార్జున. మరి సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మరోవైపు ప్రవీణ్‌ సత్తార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు నాగార్జున.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే