ఇల్లందులో ల్యాండ్‌ అయిన `ఆచార్య`.. మైనింగ్‌లో యాక్షన్‌ షురూ!

Published : Mar 07, 2021, 04:39 PM IST
ఇల్లందులో ల్యాండ్‌ అయిన `ఆచార్య`.. మైనింగ్‌లో యాక్షన్‌ షురూ!

సారాంశం

మొన్నటి వరకు రాజమండ్రిలోని మారెడుమిల్లిలో బిజీగా గడిపిన చిరంజీవి ఇప్పుడు ఖమ్మంకి షిఫ్ట్ అయ్యాడు. ఖమ్మంలోని ఇల్లందులోగల జేకే కోల్‌ మైన్స్ లోకి ల్యాండ్‌ అయ్యాడు. అక్కడ వెళ్లడం వెళ్లడంతోనే బిజీగా గడుపుతున్నాడు. 

మొన్నటి వరకు రాజమండ్రిలోని మారెడుమిల్లిలో బిజీగా గడిపిన చిరంజీవి ఇప్పుడు ఖమ్మంకి షిఫ్ట్ అయ్యాడు. ఖమ్మంలోని ఇల్లందులోగల జేకే కోల్‌ మైన్స్ లోకి ల్యాండ్‌ అయ్యాడు. అక్కడ వెళ్లడం వెళ్లడంతోనే బిజీగా గడుపుతున్నాడు. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న `ఆచార్య` షూటింగ్‌ ప్రస్తుతం ఇల్లందు కోల్‌ మైన్స్ లో జరుపుకుంటోంది. అందులో భాగంగా సెట్‌కి వెళ్లారు చిరంజీవి. 

అక్కడ జేకే కోల్‌ మైన్స్ అధికారులు చిరంజీవికి స్వాగతం పలికారు. ఇందులో చిరంజీవి బ్లాక్‌ కూలింగ్‌ గ్లాస్‌, తలపై హ్యాట్‌ ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో పలు యాక్షన్‌ ఎపిసోడ్ చిత్రీకరించే అవకాశాలున్నాయి. ఈ షెడ్యూల్‌లో చెర్రీ కూడా పాల్గొంటాడని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ `సిద్ద` అనే కామ్రేడ్‌గా, కీలక పాత్ర పోషిస్తున్నారు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే