కొడుకు సినిమా టైటిలే మర్చిపోతే ఎలా నాగ్!

First Published 10, Sep 2018, 12:12 PM IST
Highlights

సినిమా టైటిల్ బయటకి వచ్చినప్పటి నుండి అభిమానులు ఆ పేరుని జపం చేస్తూనే ఉంటారు. సినిమాపై ఫస్ట్ ఇంపాక్ట్ పడేదే టైటిల్ నుండి. అలాంటి టైటిల్ ని అంత త్వరగా మర్చిపోరు. 

సినిమా టైటిల్ బయటకి వచ్చినప్పటి నుండి అభిమానులు ఆ పేరుని జపం చేస్తూనే ఉంటారు. సినిమాపై ఫస్ట్ ఇంపాక్ట్ పడేదే టైటిల్ నుండి. అలాంటి టైటిల్ ని అంత త్వరగా మర్చిపోరు. పైగా కొడుకు నటించిన సినిమా అంటే తండ్రి అసలే మర్చిపోడు. కానీ నాగార్జున మాత్రం తన కొడుకు నటిస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' టైటిల్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి.

నిన్న జరిగిన శైలాజా రెడ్డి అల్లుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మైక్ తీసుకొని మాట్లాడే సమయంలో సినిమా పేరుని సరిగ్గా చెప్పలేకపోయాడు. తన స్పీచ్ లో శైలజారెడ్డి గారి అల్లుడు, శైలజా రెడ్డి అల్లుడు గారు, శైలజా అల్లుడు అంటున్నాడే తప్ప సినిమా టైటిల్ ని మాత్రం సరిగ్గా పలకలేకపోయాడు. ఈ విషయం అతడికి కూడా అర్ధమై కొంచెం సమయానికి ఈ సినిమా అంటూ తన స్పీచ్ ని కొనసాగించాడు.

నాగార్జున కావాలని చేయనప్పటికీ కనీసం విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమా అది కూడా తన కొడుకు నటించిన టైటిల్ మర్చిపోతే ఎలా అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు! 

ఇది కూడా చదవండి..

హరికృష్ణ మరణాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో అర్ధం కాలేదు.. నాగార్జున కామెంట్స్!

Last Updated 19, Sep 2018, 9:17 AM IST