రణవీర్ తో పెళ్లెప్పుడు..? జర్నలిస్ట్ పై దీపికా ఫైర్!

By Udayavani DhuliFirst Published 10, Sep 2018, 11:14 AM IST
Highlights

ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న దీపికా పదుకోన్ కి కోపం వచ్చేలా చేసింది. అసహనంతో అతడిపై ఫైర్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న దీపికా పదుకోన్ గత కొన్నాళ్లుగా రణవీర్ సింగ్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే

ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న దీపికా పదుకోన్ కి కోపం వచ్చేలా చేసింది. అసహనంతో అతడిపై ఫైర్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న దీపికా పదుకోన్ గత కొన్నాళ్లుగా రణవీర్ సింగ్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి టూర్లకు వెళ్లడం, కలిసి ఈవెంట్స్ కి హాజరవ్వడం చూస్తూనే ఉన్నాం. నవంబర్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. తాజాగా దీపికా మానసికంగా ఎదురయ్యే ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించింది. తను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి కూడా వెల్లడిస్తూ మహిళలు తమకంటూ కొంత సమయం కేటాయించాలని, తమకి నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉండాలని సూచించింది.

ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ రణవీర్ తో మీ పెళ్లి గురించి చెప్పండి అంటూ ప్రశ్నించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన దీపికా.. ''ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ఇవేనా'' అంటూ సదరు జర్నలిస్ట్ కి క్లాస్ కూడా పీకింది. 

Last Updated 19, Sep 2018, 9:17 AM IST