సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హీరో నాగార్జున సైతం స్పందించి ఆమెకి కౌంటర్ గా పోస్ట్ పెట్టారు. ఇది పెద్ద దుమారం రేపుతుంది.
నాగచైతన్య, సమంతలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ని ఇన్ వాల్వ్ చేస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్.. సమంతని తన వద్దకు పంపించమని అడిగాడని, తాను వెళ్లకపోవడం వల్లే ఆమెకి విడాకులు ఇచ్చారని, నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కామెంట్ చేసింది మంత్రి కొండా సురేఖ.
బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
undefined
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె ఆమె మాట్లాడుతూ, ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జునకి, కేటీఆర్‌కి మధ్య చర్చలు జరిగాయని, కూల్చేందుకు రెడీ అయ్యారని, కానీ అది కూల్చకుండా ఉండాలంటే సమంతని తన వద్దకు పంపమని నాగార్జునని కేటీఆర్ అడిగినట్టు ఆరోపించింది కొండా సురేఖ.
కేటీఆర్ వద్దకు సమంతని పంపించేందుకు నాగార్జున వాళ్లు సిద్ధమయ్యారని, కానీ సమంత వెళ్లనని చెప్పిందని, వెళ్లకపోతే మా ఫ్యామిలీ నుంచి వెళ్లిపోవాలని, విడాకులు తీసుకో అని చెప్పారని, అందుకే నాగచైతన్య, సమంత విడిపోయారని, సమంత జీవితాన్ని ఆగం చేసింది కేటీఆర్ అని ఆరోపిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది మంత్రి. సినిమా సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ, వాళ్లని బ్లాక్ మెయిల్ చేసేవాడని,
అలా రకుల్ ప్రీత్ సింగ్ వంటి కొందరు హీరోయిన్లని లోబరుచుకున్నారని, వారికి డ్రగ్స్ అలవాటు చేశాడని, ఈ గొడవలు, కేసులు పడలేకే వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ షాకిచ్చింది కొండా సురేఖ. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే అని వెల్లడించింది. సమంత జీవితం నాశనం కావడానికి కేటీఆరే అని, విడాకులకు కారణం ఆయనే అని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తెలుగు స్టేట్స్ లో పెద్ద రచ్చ అవుతున్నాయి.
ఓ మహిళా మంత్రి అయి ఉండి ఇలా మాట్లాడటం పట్ల అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అటు టీఆర్‌ఎస్ నాయకులు సైతం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమాత్రం సంస్కారం లేకుండా, దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కొండ సురేఖ ఈ ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా దీనిపై ఘాటుగానే స్పందిస్తూ మహిళా మంత్రికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరో నాగార్జున స్పందించారు. ఆమెకి కౌంటర్ ఇచ్చాడు.
హీరో నాగార్జున ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా పోస్ట్ పెట్టారు. మంత్రికి కౌంటర్ ఇచ్చాడు. `గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయజేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దం, అబద్దం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం` అంటూ నాగ్ ట్విట్ చేశారు.
దీంతో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఇది రాను రాను మరింత పెద్ద రచ్చ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలను పట్టుకుని మంత్రి ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పట్ల నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని, ఆమెపై కేసు వేయాలని నెటిజన్లు, అక్కినేని అభిమానులు నాగ్‌ని కోరుతున్నారు. మంత్రి వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నాగచైతన్య, సమంత ఏడేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. `ఏం మాయ చేసావె` సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్లింది. 2017లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కలిసి కాపురం చేశారు. కానీ అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2021 అక్టోబర్‌లోనే తమ విడాకులను ప్రకటించడం విశేషం. ఈ డైవర్స్ ప్రకటించి కూడా నేటితో మూడేళ్లు అవుతుంది.
ఆ తర్వాత సమంత చాలా డిప్రెషన్‌లోకి వెళ్లింది. అనారోగ్యానికి గురయ్యింది. ఈ క్రమంలో ఆమె సినిమాల నుంచి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం `మా ఇంటి బంగారం` అనే సినిమాలో నటిస్తుంది సమంత. అలాగే ఆమె నటించిన `సిటాడెల్` వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతుంది. ఇంకోవైపు నాగచైతన్య.. రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ఆయన నటి శోభితా దూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే మ్యారేజ్ ఉంటుందని సమాచారం.