1 నిమిషానికి 5 కోట్లు.. నయనతార రెమ్యునరేషన్ కు ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే..?

By Mahesh Jujjuri  |  First Published Oct 2, 2024, 6:06 PM IST

నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని టాక్. నయనతార ఇప్పటి వరకూ 75 సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇంకా అరడజను సినిమాలవరకూ ఉన్నాయి.


ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం బ్యూటీ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది నయనతార. అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేది లేదంటుంది సీనియర్ స్టార్. 

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎంత ఏజ్ వస్తుంటే.. అంత గ్లామర్ గా తయారవుతుంది సీనియర్ బ్యూటీ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం వన్నె తగ్గని ఈ తార.. వరుస ఆఫర్లు సాధిస్తూ.. రెమ్యునరేషన్ ను కూడా రెట్టింపు చేస్తోంది. ఒక వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ లు.. ఇంకో వైపు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ.. చేతి నిండా సంపాదిస్తోంది. 

Latest Videos

ఇక నయనతార సంపాదన మామూలుగా లేదు. ఇతర హీరోయిన్ల కంటే డబుల్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పలికే సినిమాకు ఆమె రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు సినిమాను  బట్టి డిమాండ్ చేస్తుందట. ఇక వాటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమె గట్టిగానే రెమ్యునరేషన్ లాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ కు సబంధించి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. 

ఇప్పటికే చాలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన నయనతార రీసెంట్ గా టాటా స్కై కి సబంధించిన యాడ్ ను చేశారట. అయితే దాదాపు 50 సెకండ్ల వరకూ ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ చార్జ్ చేశారట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. నయన్ కు అంత డిమాండ్ ఏంటీ.. ఎందు అంతలా ఆమె వెనకు పడుతున్నారంటూ షాక్ అవుతున్నారు

అసలు హీరోయిన్లు కెరీర్  30 ఏళ్ళు దాటితే తగ్గుతుంది. 40 ఏళ్ళు వచ్చేవరకూ హీరోయిన్లు మాయమవుతుంటారు. కొంత మంది మాత్రం క్యారెక్టర్ రోల్స్ స్టార్ట్ చేస్తారు. కాని నయనతార లాంటి కొంత మంది హీరోయిన్లు మాత్రం ఫిట్ నెస్ ను, గ్లామర్ ను కాపాడుకుంటూ.. ఇలా కొనసాగుతూ వస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. 

యష్ సినిమా కోసం ఎంత తీసుకుంటుందంటే...? 

సూపర స్టార్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. ఈసినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది నయన్. ఈరెండు సినిమాల షూటింగ్ బిజీల్ ఉంది  సీనియర్ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. ఆమెకు మరో సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది ఎవరి సినిమానో కాదు.. కన్నడ రాక్ స్టార్ యష్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 

సాధారణంగా  నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది. కాని  టాక్సిక్ సినిమా కోసం ఆమె గట్టిగా డిమాండ్ చేసిందట. ఈసినిమాో యష్ సోదరిగా నయన్ నటిస్తోందంటూ న్యూస్. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..ఈ పాత్రలో  నటించేందుకు ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని టాక్. 

అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆసినిమాలో తీసుకున్నా తీసుకోక పోయినా.. నయనతార కు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సౌంత్ సినిమాల్లో ఇంత ఏజ్ వచ్చినా.. అంత డిమాండ్ ఉన్ననటిమణుల్లో నయన్ ముందున్నారు. ఆమె తరువాత త్రిష, సమంత లాంటివారు కూడా ఈ కోవలోనే వస్తారు. 

యాంకర్ టు లేడీ సూపర్ స్టార్ 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతుంది  నయనతార. మలయాళీ అయినా ఈమె..అక్కడ సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి నయనతార.. సౌత్ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించింది.  

తమిళంలో శరత్ కుమార్ సరసన హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నయనతార.. ఆతరువాత అజిత్, రజినీకాంత్, విజయ్, విశాల్, శింబు, సూర్య, ఇలా కమల్ హాసన్ తప్పించి దాదాపు తమిళంలో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. ఇక తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగర్జున, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది బ్యూటీ. అయితే హీరోయిన్ గా ఆమెకు తెలుగు తమిళ భాషల్లో లైఫ్ ఇచ్చిన సినిమా మాత్రం చంద్రముఖినే. 

నయనతారకు ఓ అలవాటు ఉంది. ఆమె ఎంత పెద్ద స్టార్ తో సినిమా చేసినా. ఏసినిమా చేసినా.. ఎంత పెద్ద సినిమా చేసినా.. ఆమె ప్రమోషన్స్ కు మాత్రం వెల్ళదు. మరి ఏదైనా సెంటిమెంట్ ఆ.. లేక నేను ఎందుకు వెళ్లాళి అని అహంకారమా తెలియదు కాని.. ఆమె మాత్రం చాలా తక్కువగా.. అంటే తప్పదు అనుకున్న కొన్ని సినిమాల ప్రమోషన్స్ కు మాత్రమే ఆమె వెళ్ళడం గమనార్హం. 

నయనతార లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..

ఇక స్టార్ గా ఎంత ఎత్తుకు ఎదిగినా.. నయనతార పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వివాదాలు ఉన్నాయి. ఆమె హీరోయిన్ గా స్టార్ డమ్ చూస్తున్న టైమ్ లో.. తమిళ రొమాంటిక్ హీరో శిభు కారణంగా హాట్ టాపిక్ అయ్యింది. శింబుతో ప్రేమ పెళ్లి వరకూవచ్చి ఆగిపోయింది. ఇక అతనితో ఆమె చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఓ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ తో పాటు కోన్ని సీన్లు జనాలకే చిరాకుపుట్టించాయి. 

ఇక కొన్ని కారణాల వల్ల వీరిమధ్య బ్రేకప్ అయ్యింది. ఇక ఆతరువాత కొంత కాల తన సినిమాల మీద దృష్టి పెట్టిన నయనతార ఆతరువాత ఆల్ రెడీ పెళ్ళైన స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవ ప్రేమలో పడింది. ఈ విసయం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే కాదు ప్రభుదేవ భార్య కేసులు కోర్టులు అంటూ.. ఈ వివాదాన్ని వీధిలోకి లాగి నయన్, ప్రభుదేవల పరువు తీసింది. దాంతో ఈ పెళ్ళి కూడా ఆగిపోయింది. ఆతరువాత ప్రభుదేవ తన మొదటి భార్యకువిడాకులు కూడా ఇచ్చారు. 

 ఇక ముచ్చటగా మూడో సారి ప్రేమలో పడింది నయనతార. తనకంటే చాలా చిన్నవాడు అయిన యంగ్ డైరెక్టర్ విఘ్నేష్‌తో దాదాపు ఐదేళ్ళు ప్రేమలో ఉండి.. సహజీవనం చేసి.. పెళ్ళి చేసుకున్నారు. ఇక వీరి వివాహమై సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నయనతార ఇప్పటి వరకూ  75 సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇంకా అరడజను సినిమాలవరకూ ఉన్నాయి. భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది నయన్. పెళ్లి తర్వాత కూడా ఆమె  డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. 

బాలీవుడ్ లో సత్తా చాటిన నయనతార

ఇక సౌత్  లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నా  నయనతార.. ఆతరువాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. షారుఖ్ ఖాన్ జోడీగా జవాన్  సినిమా చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. అంతే కాదు గతేడాది ఆమె బాలీవుడ్ స్టార్ యాక్టర్  షారుక్ ఖాన్ సినిమాలో నటించి సంచలనంగా మారారు. ఈసినిమా సూపర్ సక్సెస్ తో బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

 ప్రస్తుతం నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. అంతే కాదు నయనతారకు బోలెడన్నీ బిజినెస్ లు కూడా ఉన్నాయి. దుబాయ్ లో కూడా కొన్ని కంపెనీలలో ఆమె ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  అంతే కాదు ఆమె సంపాదనతో లగ్జరీలైఫ్ ను కూడా లీడ్ చేస్తోంది. చార్టెడ్ ఫ్లైట్ ఉన్న ఏకైకా హీరోయిన్ గా ఆమె రికార్డ్ సాధించింది. అంతే కాదు గ్యారేజ్ లో లగ్జరీ కార్లు, హైదరాబాద్, చెన్నై, కేరళలో ఖరీదైన బంగ్లాలు, ఫారెన్ ట్రిప్ల్ లు.. ఇలా నయనతార లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను చూస్తోంది. 

click me!