సౌత్ లో సంచలన దర్శకుడి గురించి పవన్ కామెంట్స్..ఆ కమెడియన్ గురించి ఊహించని విధంగా..

By tirumala AN  |  First Published Oct 2, 2024, 6:34 PM IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా మారారు. తిరుపతి లడ్డూ వివాదం తర్వాత పవన్ సనాతన ధర్మం గురించి చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో ఉన్నారు.


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా మారారు. తిరుపతి లడ్డూ వివాదం తర్వాత పవన్ సనాతన ధర్మం గురించి చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం కోసం తన కుమార్తెలు ఆద్య, పోలేనా అంజన తో కలసి తిరుమల వెళ్లారు. 

తమిళ సంస్కృతి గురించి పవన్ కామెంట్స్ 

తిరుపతి లడ్డు వివాదం తర్వాత పవన్ తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ తమిళ సంస్కృతి గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సంస్కృతి తనకి చాలా ఇష్టం అని పవన్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తమిళం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దీనితో యాంకర్ ఆశ్చర్యపోయారు. తమిళనాడులో నేను వర్క్ చేసిన ఎస్ జె సూర్య, కరుణాకరన్ లాంటి దర్శకులు స్నేహితులుగా ఉన్నారు. 

లోకేష్ కనకరాజ్ దర్శకత్వం అంటే ఇష్టం 

Latest Videos

వాళ్ళతో తమిళంలోనే మాట్లాడుతూ ఉంటా. కాబట్టి తమిళం ఇంకా మరచిపోలేదు అని పవన్ తెలిపారు. ప్రస్తుతం తమిళంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ శైలి చాలా బాగా నచ్చుతోంది. ఆయన తెరకెక్కించిన లియో సినిమా కూడా చూశాను అని పవన్ అన్నారు. అదే విధంగా కమెడియన్ యోగిబాబు నటన కూడా చాలా బాగా నచ్చుతుంది అని చెప్పారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమిళ నెటిజన్లు పవన్ కామెంట్స్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు.

సౌత్ లో అగ్ర దర్శకుడిగా లోకేష్ కనకరాజ్  

లోకేష్ కనకరాజ్ తక్కువ సమయంలో సౌత్ లో క్రేజీ డైరెక్టర్ గా ఎదిగారు. ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుసగా కమల్ హాసన్, దళపతి విజయ్, రజనీకాంత్ లతో సినిమా చేసిన ఘనత లోకేష్ కనకరాజ్ కి దక్కుతుంది. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. కమల్ తో తెరకెక్కించిన విక్రమ్ చిత్రం అయితే తమిళనాట బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో బాగా ఈ దర్శకుడు ట్రెండ్ అయ్యారు. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలకు లింక్ పెట్టడం అందరిలో ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉండగా నటుడు యోగి బాబు ఇటీవల తమిళంలో యమా క్రేజీ కమెడియన్ గా మారిపోయారు. వీళ్లిద్దరి గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా కోలీవుడ్ జనాలని ఆకర్షించాయి. 

పవన్ ఇద్దరు కుమార్తెలు తిరుమలలో సందడి 

పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలు ఆధ్య, పోలేనాతో కలసి శ్రీవారిని దర్శించుకోవడం జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది.  పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె  పోలేనా  అప్పుడే ఇంత పెద్ద అమ్మాయిగా మారారా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్నా లెజినోవా, ఆమె పిల్లలు పోలేనా, మార్క్ శంకర్ క్రిస్టియానిటీ పాటిస్తారు. అన్య మతస్థులు తిరుమల వెళ్ళినప్పుడు టిటిడికి డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ విషయంలో ఇటీవల వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టిటిడి నియమాలు గౌరవిస్తూ తన చిన్న కుమార్తె  పోలేనా చేత డిక్లరేషన్ పై సంతకం చేయించారు. ఆమె మైనర్ కాబట్టి తండ్రిగా పవన్ కూడా సంతకం చేశారు. 

ఆద్య, పలినా కలసి కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇద్దరి తల్లులు వేరైనప్పటికీ ట్విన్ సిస్టర్స్ లాగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆద్య, పలినా నిజంగానే ట్విన్ సిస్టర్స్ లాగా ఉన్నారు. వీళ్లిద్దరి పోలికలు ఒకే విధంగా ఉండడానికి కారణం ఉంది. అదేంటంటే.. ఆద్యని చూసినప్పుడల్లా ఆమె వాళ్ళ నానమ్మ అంజనా దేవి పోలిక అంటూ కామెంట్స్ వినిపించేవి. పలినాకి కూడా నానమ్మ పోలికలే వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నానమ్మ పోలికలు మాత్రమే కాకుండా వాళ్ళ మేనత్తలు, చిరంజీవి పవన్ సిస్టర్స్ అయిన విజయ దుర్గ, మాధవి పోలికలు కూడా పవన్ కూతుళ్ళకు వచ్చాయని అంటున్నారు. బహుశా అందుకేనేమో ఆద్య, పలినా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. 

click me!