చలపతిరావు లాంటి వాళ్లకు నా సినిమాల్లో అవకాశం ఇవ్వను-నాగార్జున

First Published May 23, 2017, 8:57 AM IST
Highlights
  • చలపతిరావు వ్యాఖ్యల్ని ఖండించిన నాగార్జున
  • సమాజం అంతా ఖండించాలని స్పష్టంచేసిన కింగ్
  • వివాదంలోకి తనను లాగొద్దని, ఇలాంటి వారికి తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వనన్న నాగ్

నాగచైతన్య,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక గత ఆదివారం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అపశృతి తలెత్తిన సంగతి తెలిసిందే. సినిమాకు ట్యాగ్ లైన్ ఉండటం సహజం. అలాంటిదే రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి అమ్మాయిలు హానికరం అనే ట్యాగ్ లైన్. అయితే ఈ ట్యాగ్ లైన్ ను ఆధారంగా చేసుకుని ఆడియో వేడుకలో యాంకర్ గీత సీనియర్ నటుడు చలపతిరావును ప్రశ్న అడిగింది.

 

గీత సీనియర్ నటుడు చలపతిరావును సార్.. అమ్మాయిలు హానికరం అంటారా.. అని ప్రశ్నించినప్పుడు.. చలపతిరావు ఒళ్లుమరిచి ఎక్కడ మాట్లాడుతున్నాం.. అని కూడా ఆలోచించకుండా.. మహిళా లోకం అంతా ఈసడించుకునేలా... అమ్మాయిలు హానికరమో కాదోగాని.. పక్కలోకి మాత్రం పనికొస్తారు అని సమాధానం చెప్పడంతో... యాంకర్ రవి.. సూపర్ ఆన్సర్ అనడం... అక్కడున్న వాళ్లంతా నివ్వెరపోయారు.

 

చలపతిరావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఖండ ఖండాలుగా ఖండిస్తున్నారు సగటు మనుషులు. ఈ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున కూడా తీవ్రంగా ఖండించారు. “ చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సినవే. తీవ్రంగా ఖండించాల్సినవే. అమ్మాయిలు మనశ్సాంతికి హానికరం అనేది ఒక ట్యాగ్ లైన్.. మన్మధుడు సినిమాకు కూడా అలాంటిదే ఉంది. అది వేరు. అంతేకాని ఇలాంటి వ్యాఖ్యల్ని ఎవరు హర్షించరు. అందుకే నేను ట్విట్టర్ లో డైనోసరస్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్... అని కమెంట్ పెట్టాను. ఇలాంటి వ్యాఖ్యల్ని అందరూ ఖండించాలి. చలపతిరావే కాదు ఎవరైనా.. అలా అనకూడదు. అతను ఎందుకలా మాట్లాడాడో నాకు తెలియదని, నన్ను మాత్రం ఈ వివాదంలోకి లాగొద్దన్నారు. నా సినిమాల్లో అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వను గాక ఇవ్వను అన్నారు నాగార్జున.

 

మరోవైపు చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా లోకం పెద్దయెతత్తున మండిపడుతోంది. చలపతిరావుకు కఠినమైన శిక్ష పడేవరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు. క్షమాపలు చెప్పానా వదిలేది లేదని, ఇలాంటి వారిని సినిమాల్లో నటింపచేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.

click me!