బాహుబలి3 ఉంటుందనే హింట్ ఇచ్చిన నిర్మాత శోభు

Published : May 22, 2017, 03:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
బాహుబలి3 ఉంటుందనే హింట్ ఇచ్చిన నిర్మాత శోభు

సారాంశం

బాహుబలి 3 ఉండే అవకాశం బాహుబలి నిర్మాత మూడోసారి అంటూ ఏదో ట్వీట్ దాన్ని బట్టి బాహుబలి 3 ఉంటుందనే హింట్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ 2015లో విడుదలైన భారీ విజయాన్ని సాధించగా దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రం ఈ 2017 లో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీక్వెల్ నమోదు చేసిన రికార్డులతో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ సక్సెస్ తో పాటే ప్రేక్షకుల్లో ఇంకో ప్రశ్న కూడా పుట్టుకొచ్చింది. అదే బాహుబలి-3 ఉంటుందా లేదా అనేది. బాహుబలి 2తోనే సినిమాను ఫినిష్ చేశామని రాజమౌళి చెప్పినా ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.

 

మొదట్లో రాజమౌళి మూడవ భాగం ఉండదని అన్నా రెండవ పార్ట్ చివర్లో చిన్న లీడ్ తీసుకోవడం, ఒకవేళ సినిమా తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ తయారుచేస్తే తప్పకుండా ఉంటుందని చెప్పడంతో మూడవ భాగం ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం అందరిలోను పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చేలా బాహుబలి ప్రాంచైజీ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఒకసారి జరిగింది రెండవసారి జరగదు. కానీ రెండు సార్లు జరిగింది ఖచ్చితంగా మూడవసారి జరుగుతుంది’ అంటూ బాహుబలి సక్సెస్ గురించి ట్వీట్ చేస్తూ 3వ పార్ట్ రూపొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనిస్తో హింట్ ఇచ్చారు. మరి ఈ రాజమౌళి ఆలోచన ఎలా ఉందో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

Top 5 Heroes: అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరోలు.. చిరు, ప్రభాస్‌, నాగ్‌, బన్నీ, మహేష్‌ హౌజెస్‌ ఎలా ఉన్నాయంటే?
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు