నేను ఏ బ్యాంకుకూ బకాయిలేను-నాగార్జున

Published : Nov 17, 2016, 10:35 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నేను ఏ బ్యాంకుకూ బకాయిలేను-నాగార్జున

సారాంశం

బ్యాంకు బకాయిలపై ట్విట్టర్ ఖాతాలో స్పందించిన నాగార్జున తామము ఏ బ్యాంకుకు బకాయి లేమన్న నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లోన్ బకాయిలు చెల్లించామని స్పష్టీకరణ

 

మరోవైపు సినిమాలకు సంబంధించి... చాలా కాలం తర్వాత నాగార్జున పోలీస్ గెటప్ రీఎంట్రీ ఇచ్చేందుకు నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రేమమ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది.నాగార్జున అంటే విపరీతమైన అభిమానం ఉన్న దర్శకుడు చందూ మొండేటి. అందుకే చైతూ కి దగ్గరై ఓ మంచి కథను చెప్పాడు. అయితే చైతూ.. ప్రేమమ్ రీమేక్ చేద్దామనేసరికి రెండో ఆప్షన్ లేకుండా.,..మళయాల బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు చందూ. ఇప్పుడు తన సొంత కథను అక్కినేని హీరోలకు వినిపించాడట.

 

ముందు తను రాసుకున్న కథను చైతూ కే అనుకున్నా ఇప్పుడు ఆ కథను నాగార్జునతో చేయాలనుకుంటున్నాడట చందూ. చైతూ ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడితో సినిమా చేస్తుండటంతో ఆ ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు. మరోవైపు నాగార్జున డిసెంబర్ వరకు ఓం నమో వెంకటేశాయ సినిమాను కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. అందుకే కొత్త సంవత్సరంలో చందూ మొండేటి తో సినిమా చేయాలని చూస్తున్నాడట.  అదే నిజమైతే.. చందూ దర్శకత్వంలోనాగ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. శివమణి తర్వాత పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. రాజు గారి గది 2లో చేయడానికి నాగ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?
Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?