
మరో వైపు టూ పాయింట్ జీరో స్టోరీ లీకైందంటో కోలీవుడ్ రూమర్ చెక్కర్లు కొడుతోంది.దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రోబో2 లో రజనీకాంత్ త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.
పార్ట్ 1లో కనిపించినట్లు రెండవ భాగంలో ఆరు పాటలు ఉంటాయి. కానీ సినిమాలో కనిపించేంది మాత్రం ఒక్కే ఒక్క పాట మాత్రమే. సుమారుగా రెండేళ్ల నుంచి సెట్స్ పైన ఉన్నఈ చిత్రం.. వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కత్తి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2.0 తో ఇండియన్ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు శంకర్.