
డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. అతను ఇప్పటివరకు చేసిన సినిమాల రిజల్ట్ ఎల్లా ఉన్నా కూడా నటనలో ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అందుకోలేదు. ఇక మూడేళ్ళుగా కష్టపడి చేసిన చెన్నై వడ అనే సినిమా రిలీజ్ కోసం నానా తంటాలు పడుతున్న ధనుష్ ఎట్టకేలకు నేడు ఆ సినిమాను రిలీజ్ చేశాడు.
వివాదస్పద అంశాలతో కూడుకున్న సినిమా కావడంతో సినిమా రిలీజవ్వడం కష్టమని అంతా అనుకున్నారు. ధనుష్ వడ మాడిపోయినట్లే అనే టాక్ కూడా వచ్చింది. కానీ కల్ట్ మూవీస్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ సినిమాను తెరక్కించిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు.
చెన్నై ప్రాంతంలో బెస్తవారి వర్గం చాలా వెనుకబడినది. అయితే ఆ నేపథ్యంలో దర్శకుడు రీసెర్చ్ చేసి మరి కథను రాసుకున్నాడు. పేదవారి స్థావరాలను ఆక్రమించుకొని విదేశీ ఉన్నత కంపెనీలకు అందించడం. వారు చేసే అరాచకమైన పనులు. అప్పుడు పేదల జీవన వ్యవస్థ ఏ విధంగా మారింది అనే అంశాలను దర్శకుడు రియలిస్టిక్ గా చూపించాడు.
ఇక ధనుష్ చేసిన అన్బు పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే పోరులో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొత్తంగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఉండడంతో తెలుగులో రీమేక్ చేయలేదు. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.
మొదటి భాగం వర్కౌట్ కావడంతో మిగతా రెండు పార్ట్స్ పై అంచనాలు పెరుగనున్నాయి. వడ చెన్నై సినిమాలో 1980 నుంచి 2003వరకు జరిగిన పరిణామాలను ప్రధానంగా చూపించారు. గ్యాంగ్ స్టర్స్ గా సముతిరఖని-కిషోర్-పవన్-దీనా కనిపించగా ఐశ్వర్య రాజేష్-ఆండ్రియా జేరిమియా వారి నటనతో న్యాచురల్ గా మెప్పించారు.