మరో 20ఏళ్ల వరకు టీఆర్ఎస్ ను ఎవడూ ఆపలేడు-నాగబాబు

Published : Sep 03, 2017, 07:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మరో 20ఏళ్ల వరకు టీఆర్ఎస్ ను ఎవడూ ఆపలేడు-నాగబాబు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై మెగా బ్రదర్ నాగబాబు మనోగతం తాను చేయాలనుకున్నది చేస్తూ కేసీఆర్ దూసుకెళ్తున్నారన్న నాగబాబు మరో 20 ఏళ్ల వరకు ఇలానే పరిపాలిస్తే తిరుగులేదన్న కేసీఆర్ కు తిరుగులేదన్న నాగబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి పని తీరును భేష్ అని ప్రశంసించారు మెగా బ్రదర్ నాగబాబు. ఓ మీడియా ఇంటర్వ్యూలో తన మనోగతం వివరించారు. కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, హరిత హారం, ఐపాస్, ఆసరా లాంటి మంచి పథకాలు పెట్టారు. ఆయన చేయాలనుకున్నది చేస్తున్నారు. ఆయనను అడ్డుకున్ సత్తా వున్న వాళ్లు కూడా ఎవరూ లేరు. ఇలాగే పరిపాలిస్తే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు టీఆర్ఎస్ ను ఎవరూ ఆపలేరని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

 

కేసీఆర్, కేటీఆర్ లు , టీఆర్ ఎస్ వాళ్లు, కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ ఎవరైనా సినీ పరిశ్రమతో చాలా ఫ్రెండ్లీగా వుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఇండస్ట్రీ బతకలేదని అనిపించలేదు. అమరావతికి ఎళ్లిపోవాల్సిన అవసరం లేదు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని పర్వం ముగిశాక ఎలా వుంటుందో కానీ.. ఎవరో పని పాట లేని వాళ్లు ఇండస్ట్రీ తరలి పోతుందనే పుకార్లు సృష్టిస్తున్నారు తప్ప అలాంటిదేం లేదు. పనికి మాలిన వాళ్లు డ్రగ్స్ కేసు సందర్భంలో ఏదేదో మాట్లాడారు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. పరిశ్రమ అమరావతికి వెళ్తుందని నేననుకోను. అయినా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ అంతా డెవలప్ అయ్యాక వెళ్లటమంటే.. తుగ్లక్ వ్యవహారం లాగా వుంటుంది అన్నారు నాగబాబు.

PREV
click me!

Recommended Stories

పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో