మహేష్ పై నాగబాబు ప్రశంసల వర్షం..

Published : Sep 03, 2017, 05:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మహేష్ పై నాగబాబు ప్రశంసల వర్షం..

సారాంశం

ప్రిన్స్ మహేష్ బాబు గురించి  నాగబాబు ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు. మహేష్ బాబు అంత అందంగా ఎవరూ పరిగెత్తలేరన్న నాగబాబు మహేష్ గురించి చెప్పిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది

గత కొన్ని గంటలుగా ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. సాధారణంగా మెగా కాంపౌండ్ కు చెందిన వారు తమ హీరోలను తప్ప, ఇతర హీరోల గురించి పెద్దగా స్పందించరు, అది నెగటివ్ గా అయినా… పాజిటివ్ గా అయినా..! కానీ తాజాగా నాగబాబు ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు.

 

అంతేకాదు మహేష్ తో పాటు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ తదితర హీరోలను కూడా ప్రస్తావించారు. అయితే ఇందులో మహేష్ గురించి చెప్పిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు తనకు చెన్నైలో ఉన్న రోజుల నుండి తెలుసని చెప్పిన ‘టవర్ స్టార్,’ అప్పట్లో చాలా చబ్బీగా ఉండేవాడని, అలాగే హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాత మేం రోజూ పార్క్ లో వాకింగ్ చేస్తుంటే మా పక్క నుండి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడని, నేను అలా చూస్తుండేవాడినని, చబ్బీగా ఉన్న బాయ్ కాస్త మ్యాన్లీగా మారిపోయాడు, ఆ తర్వాత ఓ అథ్లెటిక్ లా అయిపోయాడు అంటూ ప్రిన్స్ గురించి చెప్పుకొచ్చారు.

 

పరుగుకు మహేష్ బాబు సూపర్… మహేష్ బాబు అంత అందంగా ఎవరూ పరిగెత్తలేరు… రన్నింగే అథ్లెటిక్ రన్నింగ్ లా ఉంటుంది… ఉసేన్ బోల్ట్ పరిగెత్తినట్లు పరిగెడతాడు… మహేష్ బాబు ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నాడు… ఒకవేళ మహేష్ బాబును ఏదైనా అనాలే అనుకుందాం… ఎలా అనగలుగుతాం అండి… నోరెలా వస్తుంది… నోరా తాటిమట్ట అవుతుందా నాది… వ్యక్తిగతంగా మహేష్ బాబు అంత కష్టాన్ని దూరంగా వుండి చూసాను… ఇప్పటికి ఎంత కష్టపడతాడు అతను… అంటూ నాగబాబు చెప్పిన మాటలు మహేష్ ఫ్యాన్స్ లో పులకింతలను తెప్పించే విధంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. మా అపార్ట్ మెంట్ నుండి వాళ్ళ అపార్ట్ మెంట్ లోకి ఒక థ్రెడ్ మిల్ ఉండేదని, అప్పుడప్పుడు దూరంగా చూస్తుండేవాడినని, ఒక గంట పాటు విరామం లేకుండా పరిగెడతాడు… అది కూడా స్పీడ్ రన్నింగ్… పడిపోతుంది ఇంకొకడికైతే… ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు చేయాలండి రన్నింగ్… అంటూ ప్రిన్స్ పై చెప్పిన మాటలతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

 

ఇంతలా ఓ మెగా హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి మాట్లాడితే… మరి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది… ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే..! 

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు