
మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు నామినేషన్స్ దక్కించుకుంది. ఈసారి మనకు ఆస్కార్ దక్కుతుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఎంట్రీపై టాలీవుడ్ లో వివాదం రాజుకుంది. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ని పలువురు తప్పుబడుతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర పదజాలంతో తమ్మారెడ్డి మీద విరుచుకుపడ్డారు. 'నీయమ్మా మొగుడు ఖర్చు చేశాడా రూ. 80 కోట్లు' అని ట్వీట్ చేశారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి దారుణ కామెంట్స్ చేశారు. ఆస్కార్ ఏ ఆర్ రెహమాన్ కి వస్తే అందరం సెలెబ్రేట్ చేసుకున్నాం. తెలుగు సినిమాకు దక్కుతున్న గొప్పతనాన్ని ఓర్చుకోలేని గుణమెందుకు అన్నారు. నువ్వు రిటైర్ అయిపోయావ్. నీ వలన కనీసం కుక్కకు కూడా ఉపయోగం లేదు.
అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీశావు? వాటిలో హిట్లు ఎన్ని? పెద్ద మేధావిలా నీ విశ్లేషణలు ఏంటి? నీ సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్స్ కి సరిగ్గా రెమ్యూనరేషన్ చెల్లించావా? అంటూ నిలదీశాడు. ఎనబై కోట్లు ఖర్చు చేశారనడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరో జర్నలిస్ట్ రాశారంటే, అది వాళ్ళ జీవనాధారం. సినిమా వ్యక్తివి అయ్యుండి, ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తావు.
గతంలో మెగా ఫ్యామిలీ గురించి కూడా అనుచిత కామెంట్స్ చేశావు. నేను స్పందిద్దాం అని కూడా ఎందుకులే అని ఆగిపోయాను. చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశిస్తూ నీచమైన కామెంట్స్ చేశారు. నీ మాటల్లో ఉన్న పొలిటికల్ కోణం ఏమిటో మాకు తెలుసు. సహనం నశించి ఇప్పుడు మాట్లాడటం జరిగింది. నీకే చెబుతుంది భరద్వాజ్, నోరు అదుపులో పెట్టుకో. ఇకనైనా ఇలాంటి పనులు చేయడం మానుకో. నాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే... లక్ష రెట్లు కౌంటర్స్ ఇస్తాను... అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
నాగబాబు వీడియో దుమారం రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే దారుణంగా భరద్వాజ్ మీద విరుచుకుపడ్డాడు. భరద్వాజ్ చేత ఎవరో మాట్లాడిస్తున్నట్లు నాగబాబు పరోక్షంగా చెప్పారు. గతంలో మెగా ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ కి సందర్భం దొరకడంతో బదులు తీర్చుకున్నాడపిస్తుంది. ఆ మధ్య 'సినిమాకు యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నాడా?' అని భరద్వాజ్ ప్రశ్నించారు. నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా... భరద్వాజ్ స్పందన ఏంటో చూడాలి.