Prema Entha Maduram: నిజం తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్న అను.. భార్యని అనుమానిస్తున్న ఆర్య!

Published : Mar 10, 2023, 12:55 PM IST
Prema Entha Maduram: నిజం తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్న అను.. భార్యని అనుమానిస్తున్న ఆర్య!

సారాంశం

Prema Entha Maduram: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం  సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటుంది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ సీరియల్ కి మంచి రేటింగ్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈరోజు మార్చి 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో తన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రామాయణం గురించి చెప్పాను కదా అందులో రాముడు అంతటి గొప్పవాడు ఆర్య సార్ అంటుంది  అను. మరి పాప పుడితేనో అని అనుమానం గా అడుగుతుంది ఆ అమ్మాయి. అను లాగా పెంచుతాను అంటాడు ఆర్య. తనెవరు అంటుంది ఆ అమ్మాయి.

అనురాధ అని చాలా మంచి అమ్మాయి తెలివైన అమ్మాయి కాకపోతే కాస్త మొండితనం ఎక్కువ అయినా నాకు ఆ మొండితనం ఇష్టమే అనుకో, తన అనుకున్న వాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్తుంది. మీ అక్క చెప్పిన రామాయణంలోని సీతమ్మ లాగా ఎన్ని బాధలైనా ఓర్పుతో భరిస్తుంది అంటాడు ఆర్య. అయితే నేను పెద్దయ్యాక అనురాధ లాగా అవుతాను అంటుందిఆ అమ్మాయి.

నేను ఆర్య వర్ధన్ లా అవుతాను అంటాడు ఆ అబ్బాయి. అందుకు ఆర్య దంపతులిద్దరూ నవ్వుకుంటారు. మరోవైపు అను, అంజలి దగ్గరకు వచ్చి ఏం వండమంటారు అని అడుగుతుంది నువ్వు ఏమీ ఉండొద్దు మనిద్దరమే ముఖ్యమైన ప్లేస్ కి వెళ్తున్నాము అంటుంది అంజలి. ఎక్కడికి పని అనుమానం గా అడుగుతుంది అను. సర్ప్రైజ్ అంటుంది అంజలి.

నేను ఎక్కడికీ బయటికి వెళ్ళను మీకు తెలుసు కదా అని మొహమాటంగా ఉంటుంది అంజలి. నేను నిన్ను ఏమీ దూర దీశానికి తీసుకువెళ్లట్లేదు అయినా నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను.  ఇక్కడ నా ఫ్రెండ్ వి, వెల్ విష్ యు నువ్వే కదా అంటుంది అంజలి.అయినా నేను నిన్ను సిస్టర్ అనుకోవటమే కానీ నీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండాలి కదా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.

 అలా అనొద్దు అంటూ ఆమెతో పాటు వెళ్లడానికి ఒప్పుకుంటుంది అను. అందుకు ఆనందంతో నేను ఏం చెప్పినా వినాలి ఎందుకు, ఏమిటి అని అనకూడదు అంటుంది. ఒక చీర తీసుకొని వచ్చి కట్టుకోమంటుంది. ఎందుకు అని అంజలి అంటే ఎందుకు ఏంటి అని అడగొద్దు అన్నాను కదా అంజలి. చేసేది లేక చీర కట్టుకొని వస్తుంది అను.

ఆమెని అలా చూసిన అంజలి  చాలా బాగున్నావు అంటూ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వేసుకోమంటుంది. అను వేసుకోవడంతో ఇద్దరు కలిపి అక్కడ నుంచి బయలుదేరుతారు. యాదగిరి సైట్ దగ్గరికి వచ్చి అందరూ ఎక్కడ పనిలో అక్కడ ఆపేసి వచ్చి కారు ఎక్కండి అంటాడు. ఎక్కడికి అంటాడు ఆర్య. అంజలి మేడం తీసుకురమ్మన్నారు అంటాడు యాదగిరి.

మీరు వెళ్ళండి నేను వర్క్ చేస్తాను అంటాడు ఆర్య. ముఖ్యంగా నిన్నే తీసుకురమ్మంది మేడం అంటాడు యాదగిరి అంతలోనే అంజలి ఫోన్ చేసి బయలుదేరారా అంటే ఆర్య రానంటున్నాడు అంటాడు యాదగిరి. అయితే ఫోన్ ఆర్య కి ఇవ్వు అనటంతో ఫోన్ ఆర్యకిస్తాడు యాదగిరి. గురూజీ మన టీం అందరికీ  నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీరు అందరూ వస్తున్నారు అంతే అంటూ ఆర్డర్ పాస్ చేసి ఫోన్ పెట్టేస్తుంది అంజలి.

మరోవైపు అన్ని రెడీయేనా అంటూ తల్లిని కంగారు పెట్టేస్తుంటాడు నీరజ్. ఎందుకంత కంగారు పడుతున్నావ్, నువ్వు చెప్పినవన్నీ సిద్ధంగా ఉన్నాయి  అంటుంది శారదమ్మ.  ఇదంతా చూస్తున్న మాన్సీ,ఏంటి అమ్మ కొడుకులు ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నారు ఏంటి విశేషం అనుకుంటూ శారదమ్మ దగ్గరికి వెళ్లి ఇవన్నీ ఎందుకు చేశారు ఏంటి విశేషం ఈరోజు పండగ కూడా కాదు కదా అంటుంది.

పండగ లాంటిదే ఉంటుంది శారదమ్మ. అంటే అంటుంది మాన్సీ అర్థం కానట్లుగా. గెస్ట్ లు వచ్చాక నీకే అర్థమవుతుంది అని నీరజ్ అంటే గెస్టులు ఎవరు, బిజినెస్ పీపుల్ కి ఇంట్లో ఇలాగా అరేంజ్ చేయరు కదా ఫ్యామిలీ ఫ్రెండ్సా అంటూ కన్ఫ్యూజన్ గా అడుగుతుంది మాన్సీ. వెయిట్ చెయ్ నీకే తెలుస్తుంది అంటూ శారదమ్మని తనతో తీసుకొని వెళ్ళిపోతాడు నీరజ్.

ఎవరు వస్తున్నారు అంటూ కంగారుపడుతున్న మాన్సీకి సడన్గా కొంపతీసి బ్రో ఇన్ లా, అను గానీ వస్తున్నారా అంటూ ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. రేపు కారులో వస్తున్న అను ఎక్కడికి వెళ్తున్నాము అని అంజలిని అడుగుతుంది. మన ఇంటికి వచ్చింది కదా మాన్సీ వాళ్ళ ఇంటికి అంటుంది అంజలి. అను నేను ఎందుకు అక్కడికి నేను దిగిపోతాను అంటూ కంగారుగా చెప్తుంది అను.

స్టాప్ తో పాటు అందరినీ నీరజ్ ఇన్వైట్ చేశారు, కామ్ గా కూర్చో అంటుంది అంజలి. నీరజ్ వల్ల ఇంటి ముందు కారు ఆగుతుంది. అంజలి కార్ దిగుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ కి వెళ్లి అట్నుంచి ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అను. కారులో వచ్చాము కదా జర్నీ ఇన్కన్వీనెంట్ గా ఉండి ఉంటుంది ఎలాగూ వచ్చేసాం కదా భోజనం చేసేసాక నేనే డ్రాప్ చేస్తాను అంటూ బలవంతంగా ఆమెని తనతో పాటు తీసుకు వెళుతుంది.

 అనుని చూసిన శారదమ్మ, నీరజ్  చాలా ఆనందపడతారు. ఇన్వైట్ చేసినందుకు థాంక్స్ అంటూ అనుని పరిచయం చేస్తుంది అంజలి. తను మా ఇంట్లో అని చెప్పబోతుండగా ఇప్పుడు నా పరిస్థితి ఎందుకు అంటూ అడ్డుకుంటుంది అను. పరిచయం చేయాలి కదా మొన్న పార్టీలోనే చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు అంటుంది అంజలి.

 పర్వాలేదులెండి ఎప్పుడైతే నేమి కొన్ని పరిచయాలు అనుబంధాలుగా కూడా మారొచ్చు అంటూ తన తల్లిని అంజలి కి పరిచయం చేస్తాడు. అపర్ణ చాలా మంచి పేరు అంటూ ఆరోగ్యం బాగుందా అని కుశలం అడుగుతుంది  శారదమ్మ. నిన్ను చూస్తే చాలా దగ్గర మనిషి లాగా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతుంది. తను చాలా మంచిది నేను కూడా అందుకే చాలా త్వరగా కనెక్ట్ అయిపోయాను అంటుంది అంజలి.

సరే లోపలికి వెళ్దాం రండి అని శారదమ్మ అంటే ఒక్క నిమిషం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వచ్చాక ఒకేసారి లోపలికి వెళ్దాం అంటాడు నీరజ్. ఇదంతా లోపల నుంచి చూస్తున్న మాన్సీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు కారులో వస్తున్న ఆర్య నాకు సైట్లో చాలా పని ఉంది కారు ఆపితే నేను వెళ్లి నా పని చూసుకుంటాను అంటాడు. మాకు మాత్రం పనులు లేవా మేము వెళ్లట్లేదా గమ్మున కూర్చో అంటాడు యాదగిరి.

కారు నేరుగా నీరజ్ వాళ్ళ ఇంటిముందు ఆగుతుంది. అంజలి రిసీవ్ చేసుకోవడానికి వెళుతుంటే నేను కూడా వస్తాను అంటాడు. కొంపదీసి ఆర్య సార్ కాదు కదా అని టెన్షన్ పడుతుంది  అను. కారు దిగి లోపలికి రావడానికి ఇబ్బంది పడుతున్న ఆర్యని నీరజ్ దగ్గరుండి లోపలికి తీసుకు వెళ్తాడు. అను ఇక్కడుందేంటి, నీరజ్ రమ్మన్నాడా అనుకుంటాడు ఆర్య.

 లోపలికి వస్తున్న ఆర్య ని చూసి నేను అంజలి మేడం దగ్గర  వంట చేస్తున్న విషయం తెలిసిపోతుందేమో అని కంగారు పడిపోతుంది అను. అంజలి వాళ్ళందరినీ మా టీం అంటూ శారదమ్మ కి పరిచయం చేస్తుంది. ఆర్య శారదమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటాడు. మొదటిసారి ఏ ఆడపిల్ల అయినా ఇంటికి వస్తే హారతి ఇచ్చి లోపలికి తీసుకు వెళ్తాము, పైగా కడుపుతో ఉన్న అమ్మాయి కూడా ఉంది అంటూ పని అమ్మాయికి హారతి తీసుకురమ్మని చెప్తుంది.

మాన్సీని పిలిచి హారతి ఇచ్చి గెస్ట్ లని రిసీవ్ చేసుకో అంటుంది శారదమ్మ.అప్పుడే మాన్సీ ని చూసిన అంజలి ఇక్కడే ఉన్నావా నేను గమనించలేదు అంటుంది. ఇబ్బందిగా మొహం పెడుతూ వాళ్లకి హాయ్ చెప్పి అంతే ఇబ్బందిగా హారతి ఇస్తుంది మాన్సీ. మాన్సీ చేత బొట్టు కూడా పెట్టిస్తుంది శారదమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

PREV
click me!

Recommended Stories

Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?