పవన్ పై విమర్శలా.. బూతులతో విరుచుకుపడ్డ నాగబాబు!

Published : May 04, 2019, 10:55 AM IST
పవన్ పై విమర్శలా.. బూతులతో విరుచుకుపడ్డ నాగబాబు!

సారాంశం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్ధి నాగబాబు ప్రత్యర్ధ పార్టీల నేతలను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్ధి నాగబాబు ప్రత్యర్ధ పార్టీల నేతలను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసభ్యపదజాలంతో వారిని దూషించిన నాగాబాబు వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

దీనికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న జనసేన నేతలంతా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు  లేవు. అయితే పవన్ సోదరుడు నాగబాబు అదుపు తప్పి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ''నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వాళ్లు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు'' అంటూ నోటికొచ్చినట్లు తిట్టేసారు నాగబాబు.

విపక్ష పార్టీల తరఫున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్ట్ గాళ్లు అంటూ నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్  గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు కానీ నాగబాబు సంస్కారం మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఆరోపణలు చేయొచ్చు కానీ వ్యక్తిత్వాన్ని హన్మ చేసే విధంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయాలను మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బూతులు తిట్టడమేనా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబు చేసిన వ్యాఖ్యలను క్షమాపణలు కోరాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.   

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు