'మహర్షి' సెన్సార్ పూర్తి!

Published : May 04, 2019, 10:27 AM IST
'మహర్షి' సెన్సార్ పూర్తి!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమైంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమైంది. మే 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ 25వ సినిమా కావడంతో 'మహర్షి'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్రైలర్ మహేష్ మూడు గెటప్స్ ని చూపించారు. దీంతో సినిమా మరింత ఆకట్టుకునేలా ఉంటుందని  అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

మగాడితో నా అవసరం ఇదే.. ఒంటరిగా ఉండటమే ఇష్టం.. చిరంజీవి హీరోయిన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Anchor Suma: నీకు టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు.. నేను ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే...