వృద్ధుడైనా.. యువకుడైనా.. నాకు ఓకే.. రకుల్ షాకింగ్ కామెంట్స్!

Published : May 04, 2019, 10:10 AM IST
వృద్ధుడైనా.. యువకుడైనా.. నాకు ఓకే.. రకుల్ షాకింగ్ కామెంట్స్!

సారాంశం

ప్రేమలో పడడానికి ఎదురుచూస్తున్నట్లు, దానికి వయసుతో సంబంధం లేదని అంటోంది నటి రకుల్ ప్రీత్ సింగ్.

ప్రేమలో పడడానికి ఎదురుచూస్తున్నట్లు, దానికి వయసుతో సంబంధం లేదని అంటోంది నటి రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' అనే సినిమాలో నటించింది. 

ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో 26 ఏళ్ల రకుల్ యాభై ఏళ్ల అజయ్ ప్రేయసిగా నటించారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ని 'నిజ జీవితంలో మీ కన్నా వయసు బాగా ఎక్కువ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారా..?' అని ప్రశ్నించగా.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.

'నిజ జీవితంలో నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా.. ఆ వ్యక్తి వృద్ధుడా..? లేదా యువకుడా..? అనేది అనవసరం' అంటూ చెప్పుకొచ్చింది. ఓ బంధాన్ని ఎవరూ నెంబర్లతో నిర్వచించడం లేదని, వయసుతో సంబంధం లేకుండా ఓ మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారని.. ఈ సినిమాలో కూడా అదే విషయాన్ని చూపించినట్లు చెప్పుకొచ్చింది.

కుటుంబం మొత్తం కలిసి ఈ సినిమా చూడొచ్చని, తను కూడా తన తల్లితండ్రులతో కలిసి సినిమా చూస్తానని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి