Naga Shourya Experiment: ఫ్యామిలీ మెన్ మేకర్స్ తో నాగశౌర్య సినిమా

Published : Dec 21, 2021, 12:29 PM ISTUpdated : Dec 21, 2021, 04:19 PM IST
Naga Shourya Experiment:  ఫ్యామిలీ మెన్ మేకర్స్ తో నాగశౌర్య సినిమా

సారాంశం

  మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య. వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నా.. ఎక్స్ పెర్మెంట్స్ మాత్రం ఆపడం లేదు యంగ్ స్టార్.

టాలీవుడ్ యంగ్ స్టార్ నాగశౌర్య(Naga Shourya,)స్పీడ్ గా పరిగెడుతున్నాడు. కానీ మనోడికి కాలమే కలిసి రావడం లేదు. చసిన ప్రతీ సినిమా ప్లాప్ అవుతుంది. కొత్తగా ట్రై చేద్దామని చేసిన ప్రతీ ప్రయోగం బెడిసిడొడుతుంది. ఈ ఏడాది శౌర్య నుంచి వచ్చిన 'వరుడు కావలెను' .. 'లక్ష్య' రెండు సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. ' పోలీస్ వారి హెచ్చరిక' సినిమాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో  ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి..మళ్లీ తనను లైన్ లో పడేస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు యంగ్ హీరో.

ఈ రెండు సినిమాలతో పాటు నాగశౌర్యకు(Naga Shourya,) మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్లోనే ఉన్నాయి.ఇవి ఉండగానే యంగ్ స్టార్ మరో క్రేజీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను ఫేమస్ డైరెక్టర్స్ రాజ్ – డీకే (Raj-Dk) లు నిర్మిస్తున్నట్టు సమాచారం. క్రేజీ డైరెక్టర్లు హ్యాండిల్ చేస్తుండటంతో నాగశౌర్యకు ఎక్కలేని నమ్మకం వచ్చేసింది. అందుకే ఏం ఆలోచించకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.  

రాజ్ నిడిమోరు - డీకే కృష్ణ ఇద్దరూ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. ఇంతకు  ముందు వీరు 'డి ఫర్ దోపిడీ' సినిమాను నిర్మించారు. ఆ తరువాత  'సినిమా బండి' అనే మరో సినిమాకి కూడా వీరిద్దరు నిర్మించారు. ఇక వీరి కాంబినషన్  కలిసి హిందీలో  వచ్చిన 'ఫ్యామిలీ మేన్'(The Family Man) వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ కి అన్నీ తామై వ్యవహరించారు రాజ్ - డీకే. ఈ వెబ్ సిరీస్ ఈ ఇద్దరికి  దేశప్యాప్తంగా  మంచి పేరు వచ్చింది.

ఇక  మళ్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్... అందుకు సంబంధించిన ప్రయత్నాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక పై గ్యాప్ రాకుండా తమ బ్యానర్లో ఒక మాదిరి బడ్జెట్ లో వరుసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారట. కొత్త కాన్సెప్ట్ లకు .. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ముందుగా నాగశౌర్య(Naga Shourya,)తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. గతంలో తాము నిర్మించిన 'సినిమా బండి'ని డైరెక్ట్ చేసిన న ప్రవీణ్ కాండ్రేగుల తోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.  అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైనట్టు సమాచారం.

Tamannaah Birthday: హ్యాపీ బర్త్ డే మిల్క్ బ్యూటీ తమన్నా

ఈ సినిమాకి సంబంధించిన అఫిషయల్ అనౌన్స్ మెంట్ కూడా త్వరలో ఉండబోతోంది. నాగశౌర్య(Naga Shourya,)తో పాటు హీరోయిన్, కో యాక్టర్స్ ఎంపిక పూర్తి చేసిన తరువాతే సినిమాను ప్రకటించాలని భావిస్తున్నారట మేకర్స్. వచ్చే ఏడాది సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తునారు మేకర్స్.. హీరో Naga Shourya కూడా కెరీర్ లో తాను ఇంతవరకూ చేయని డిఫరెంట్ పాత్ర చేయస్తున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే