Naga Chaitanya:చైతూ వెబ్ సీరిస్ నుంచి షాకింగ్ అప్డేట్

Surya Prakash   | Asianet News
Published : Dec 21, 2021, 12:20 PM IST
Naga Chaitanya:చైతూ వెబ్ సీరిస్ నుంచి షాకింగ్ అప్డేట్

సారాంశం

స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా... 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీయబోతున్నారు. నాగ చైతన్యకు జోడిగా ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనున్నారు.

సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్‌లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌లలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు హీరోలు కూడా వీటిలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు యంగ్‌ హీరో నాగచైతన్య.

అక్కినేని నాగ చైతన్య,  దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సీరిస్  డిసెంబర్ చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారట. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా... 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీయబోతున్నారు. నాగ చైతన్యకు జోడిగా ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనున్నారు.

 అంతేకాకుండా ఈ వెబ్‌ సిరీస్‌ హర్రర్‌ కథాంశంతో వస్తున్నట్లు తెలిపాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. నాగచైతన్య తన కెరీర్‌లో హర్రర్‌ కథలో నటిస్తుండడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే మొదట కథ విన్న నాగచైతన్య కాస్త ఆశ్చర్యపడ్డా పాత్ర నచ్చడంతో సినిమాకు ఒప్పుకున్నట్లు తెలిపాడు. మరి తొలిసారి నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్న నాగచైతన్య ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి. 

ఈ వెబ్ సిరీస్, 'థాంక్యూ' సినిమా కాకుండా తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.   'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడటంతో.... ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌