Unstoppable With NBK: తగ్గేదే లే.. బాలయ్య 'అన్ స్టాపబుల్'లో అల్లు అర్జున్, ప్రీమియర్స్ డేట్ ఫిక్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 21, 2021, 12:19 PM IST
Unstoppable With NBK: తగ్గేదే లే.. బాలయ్య 'అన్ స్టాపబుల్'లో అల్లు అర్జున్, ప్రీమియర్స్ డేట్ ఫిక్స్

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ బన్నీ నటనతో అదరగొట్టాడు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ బన్నీ నటనతో అదరగొట్టాడు. దీనితో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. బన్నీ ఊరమాస్ గెటప్ అభిమానులని ఆకట్టుకునే విధంగా ఉంది. 

ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి Allu Arjun ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం , అఖండ టీం, రాజమౌళి హాజరయ్యారు. ఆరవ ఎపిసోడ్ కి అల్లు అర్జున్ అతిథిగా హాజరవుతున్నాడు. 

ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 25 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అల్లు అర్జున్, బాలయ్య మధ్య బంధం బాగా బలపడుతోంది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య షోకి బన్నీ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. దీనితో ఈ షోలో బాలయ్య బన్నీకి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు.. బన్నీ ఏం మాట్లాడతాడు అనే ఉత్కంఠ నెలకొంది. 

క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ ని ఆహా సంస్థ స్పెషల్ గా ప్లాన్ చేస్తోంది అట. బన్నీతో పాటు పుష్ప టీం కూడా అన్ స్టాపబుల్ షోకి హాజరు కానున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. స్మగ్లింగ్ కూలీగా ఉన్న అల్లు అర్జున్ డాన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథ. 

Also Read: Bheemla Nayak Postpone: భీమ్లా నాయక్ కోసం దిల్ రాజు త్యాగం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు