ప్రముఖ హాలీవుడ్ నటి షారన్ స్టోన్ (Sharon Stone) తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆమె నటించిన న్యూడ్ సీన్ వల్ల తన కుమారుడికి దూరంగా కావాల్సి వచ్చిందని భావోద్వేగమైంది.
నటీనటులు సినిమాల విషయంలో చాలా సాహసాలు చేస్తుంటారు. పాత్ర నచ్చితే తమకు గుర్తింపు తెచ్చుందని భావిస్తే ఎలాంటి రోల్స్ లోనైనా నటించేందుకు వెనకాడరు. మరీ ముఖ్యంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ మరింత ముందడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటి షారన్ స్టోన్ తన కేరీర్ లో చేసిన ఓ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కేరీర్ ప్రారంభంలో తన గుర్తింపు తెచ్చి పెట్టిన ఆ చిత్రమే.. తన కొడుకునూ కోల్పోయేలా చేసిందంటూ భావోద్వేగమైంది.
1992లో వచ్చిన Basic Instinctలో షారన్ స్టోన్ న్యూడ్ సన్నివేశంలో నటించింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును సైతం తెచ్చిపెట్టింది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. శ్రుంగారతారగా మంచి పేరు దక్కించుకుంది. అయితే ఇదే సినిమాతో తన కొడుకు కూడా ఆమెకు దూరయ్యాడం బాధాకరం. ఇదే విషయాన్ని షారన్ స్టోన్ తాజాగా ‘ఐ హర్డ్ రేడియో’ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ వెల్లడించారు. తన కొడుకును కోల్పోవడం పట్ల ఎమోషనల్ అయ్యారు.
2000ల సంవత్సరంలో తన భర్త ఫిల్ బ్రోన్ స్టెయిన్ నుంచి విడాకులు కోరుతూ షారన్ స్టోన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటికే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అయితే విచారణలో భాగంగా కోర్టులో జడ్జీ తన కొడుకును ‘మీ అమ్మ సెక్స్ మూవీస్ చేస్తుంది తెలుసా’ అని ప్రశ్నించాడని తెలిపింది. ఆ సినిమా వల్లే నన్ను అపఖ్యాతి పాలు చేశారు. ఫలితంగా డివోర్స్ విచారణలో భాగంగా నా దగ్గర పెరగాల్సిన కొడుకు నాకు దూరమయ్యాడంటూ ఎమోషనల్ అయ్యింది. కేవలం 16 సెకండ్లు ఉన్న ఆ సీన్ వల్ల తను చాలా హేళనకు, వ్యతిరేకతకు, విమర్శకులకు గురయ్యానని తెలిపింది.
ప్రస్తుతం టీవీల్లో దుస్తుల్లేకుండానే కనిపిస్తున్నారని, దాంతో పోల్చితే నా న్యూడ్ వీడియో ఎంతంటూ వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ సందర్భంలోనూ తన పేరు విని అందరూ నవ్వుకున్నారని, అది తనను బాగా బాధించందన్నారు. ఇక ‘బేసిక్ ఇన్ స్టింక్ట్’ చిత్రంలో తను ఎంపికవ్వడానికి చాలా కష్టపడ్డానని, 9 నెలల పాటు ఆడిషన్ నిర్వహించారని తెలిపారు. అప్పట్లో ఈ చిత్రం 300 మిలియన్ల డాలర్స్ వసూల్ చేసి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె రీసెంట్ గా తన సోదరుడు కన్నుమూశారని తెలిపింది. ఆ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు.