నడిరోడ్డుపై యువకుడితో గొడవ.. మధ్యలో పోయినందుకు నాగ శౌర్యకే.. స్పందించిన యంగ్ హీరో..

By Asianet News  |  First Published Jun 28, 2023, 4:07 PM IST

మీకూ గుర్తుండే ఉంటుంది.. కూకట్ పల్లిలో నడిరోడ్డుపై నాగశౌర్య  ఓ యువకుడితో గొడవ పడ్డ ఘటన అప్పట్లలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా శౌర్య  అప్పటి వివాదంపై స్పందించారు. 
 


యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)  తన అప్ కమింగ్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. కానీ పెద్ద ఈ సినిమా ఆడలేదు. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘రంగబలి’ టైటిల్ తో ఫన్, యాక్షన్ తో ఆకట్టుకోబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలై ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉంటే.. Rangabali  చిత్ర ప్రమోషన్స్ లో నాగశౌర్య బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో యువకుడితో గొడవ పడటానికి గల కారణాన్ని తెలియజేశారు. శౌర్య మాట్లాడుతూ.. కూకట్ పల్లిలో రోడ్డుపై ఓ అబ్బాయి అమ్మాయిని కొడుతున్నాడు. అక్కడే ఉన్న నేను కారు దిగి ఎందుకు కొడుతున్నావని అడిగాను. దాంతో ఆ అమ్మాయే నామీదకు సీరియస్ అయ్యంది. 

Latest Videos

నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడితే కొడతాడు.. చంపితే చంపుతాడు.. మీకేంటి అంది. అందుకే అమ్మాయిలకు చెబుతున్నాను. కొట్టే అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ ఫ్యామిలీకి అస్సలు మంచిది కాదు. ప్రేమగా చూసుకునే వాళ్లతో కొట్టే వాళ్లతో పెళ్లి చేసుకోవద్దని సూచించారు. ఇక ఆరోజు జరిగిన ఘటనలో ఆ అమ్మాయిదే తప్పు అని కూడా చెప్పుకొచ్చారు. 

ఇక ఆరోజు వీడియోలో.. నడిరోడ్డుపై ఓ యువకుడి ప్రవర్తనను సహించలేకపోయాడు. అందుకు సంబంధించిన వీడియో అప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నాగశౌర్య కారులో వెళ్తుండగా.. ఓ యువకుడు తన లవర్ (యువతి)పై చేయిచేసుకున్నాడు. చూసిన నాగశౌర్య  యువకుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడి చేయి పట్టుకొని రోడ్డు మీద అమ్మాయిని కొడతావా ‘ఆమెకు సారీ చెప్పు’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఆ యువకుడు ఆమె నా లవరే అంటూ బదులిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ‘నీ లవరైతే కొడ్తారా?.. అలా చేయడం తప్పు.. వెంటనే ఆమెకు సారీ చెప్పు అంటూ మందలించాడు.’
 

click me!