మామయ్య కథ చివరికి మెగా మేనల్లుడి వద్దకి.. సురేందర్‌రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే?

Published : Jun 28, 2023, 03:19 PM ISTUpdated : Jun 28, 2023, 03:22 PM IST
మామయ్య కథ చివరికి మెగా మేనల్లుడి వద్దకి.. సురేందర్‌రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే?

సారాంశం

`ఏజెంట్‌` డిజాస్టర్‌ ప్రభావం దర్శకుడు సురేందర్‌రెడ్డిపై పడింది. ఆయనకు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు. సురేందర్‌రెడ్డికి. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. కానీ... 

సురేందర్‌రెడ్డి `ఏజెంట్‌` సినిమాతో ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఈ సినిమా నష్టం అంతా ఇంతా కాదు. గతేడాది కొరటాల శివకి `ఆచార్య` ఎలాంటిదో, ఇప్పుడు సురేందర్‌రెడ్డికి `ఏజెంట్‌` అలాంటి డిజాస్టరనే చెప్పాలి. అఖిల్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన పరాజయం చెందింది. సుమారు 60-70కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకి కనీసం పది కోట్ల నెట్‌ కూడా రాలేదు. యాభైకోట్లకుపైగా నష్టాలు చవిచూసిందీ మూవీ. కొన్న బయ్యర్లు, నిర్మాత భారీగా నష్టపోయారు. ఓటీటీ, డిజిటల్‌ కొంత ఆదుకున్నాయి. కానీ నష్టం మాత్రం గట్టిదే. 

`ఏజెంట్‌` డిజాస్టర్‌ ప్రభావం దర్శకుడు సురేందర్‌రెడ్డిపై పడింది. ఆయనకు నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది క్లారిటీ లేదు. సురేందర్‌రెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. ఎస్‌ఆర్‌టీ బ్యానర్‌పి రామ్‌ తాళ్లూరి కాంబినేషన్‌లో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రస్తుతం ఈ సినిమా చేసే అవకాశం లేదు. ఆయన కమిట్‌మెంట్స్ వేరే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు చేసేసి పాలిటిక్స్ లో బిజీ కాబోతున్నారు. 

ఈ నేపథ్యంలో సురేందర్‌ రెడ్డి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారట. తాజాగా మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. పవన్‌ సినిమా కథతోనే వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా చేయబోతున్నారట సురేందర్‌రెడ్డి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. సురేందర్‌రెడ్డికి గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసే కమిట్‌ మెంట్ ఉంది. అల్లు అర్జున్‌తో ఆ సినిమా అనుకున్నారు. కానీ బన్నీకి ఇప్పుడున్న పరిస్థితులో కుదరదు. దీంతో వైష్ణవ్‌తేజ్‌తో, గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకి సురేందర్‌రెడ్డినే దర్శకత్వం వహిస్తారా. వేరే దర్శకుడితో చేయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

`ఉప్పెన` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు వైష్ణవ్‌ తేజ్‌. కానీ ఆ తర్వాత సినిమాలు మాత్రం ఆడలేదు. `కొంగపొలం`, `రంగరంగ వైభవంగా` చిత్రాలు దారుణంగా పరాజయం చెందాయి. ఇప్పుడు `ఆదికేశవ్‌` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీలా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్
మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్