‘స్పై’ రిలీజ్ తర్వాత నిఖిల్ రెండు నెలల ప్లానింగ్.. ఏంటంటే?

By Asianet News  |  First Published Jun 28, 2023, 3:07 PM IST

డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  లేటెస్ట్ ఫిల్మ్ ‘స్పై’. రేపు గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నిఖిల్ రెండు నెలలు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఈ గ్యాప్ మరో ముఖ్యమైన పని చేయబోతున్నారని చెప్పారు.


టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తీకేయ 2’ రిలీజ్ తర్వాత నిఖిల్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లు రాబడుతున్నారు. దీంతో నిఖిల్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుతం నిఖిల్ Spy చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా కొన్ని కీలక విషయాలను చెప్పబోతున్నట్టు ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యూనిట్ తో కలిసి ‘స్పై’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నార్త్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘స్పై’ రిలీజ్ సందర్భంగా ముంబై, కర్ణాటక వంటి ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్  అయితే దక్కుతోంది.

Latest Videos

ఇక ఇంటర్వ్యూల్లోనూ నిఖిల్ ఆసక్తికరమైన అంశాలను వెల్లడిస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. నిఖిల్ ఈ ఏడాది మే14న పల్లవి వర్మను పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. వీరి మ్యారేజ్ తర్వాత పెద్దగా వెకేషన్లకు వెళ్లింది లేదు. దీంతో నిఖిల్ ‘స్పై’ మూవీ తర్వాత షూటింగ్ లకు  కాస్తా బ్రేక్ ఇవ్వబోతున్నట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. రెండు నెలల వరకు వెకేషన్ లో ఉంటానని చెప్పారు. వియాత్నం వెళ్లబోతున్నానని తెలిపారు. 

 భారీ బడ్జెట్ తో నిఖిల్ 20వ సినిమాగా ‘స్వయంభు’ రూపుదిద్దుకుంటోంది. హిస్టారికల్ వార్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నిఖిల్ బర్త్ డే సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.  రామ్ చరణ్ బ్యానర్ లో ‘ది ఇండియన్ హైజ్’ కూడా రాబోతోంది. అలాగే ‘కార్తీకేయ 3’ కూడా రానుంది. 

ఇదిలా ఉంటే.. స్పై చిత్రం రేపు (జూన్ 29) గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ రివ్యూ అదిరిపోయిందని తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. 
 

click me!