నాగ చైతన్య - సమంత.. మొదలెట్టేశారు!

Published : Oct 10, 2018, 07:05 PM IST
నాగ చైతన్య - సమంత.. మొదలెట్టేశారు!

సారాంశం

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా నేటి తరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న యువ జంట నాగ చైతన్య - సమంత. ఇరు మతాలను గౌరవించి గత ఏడాది ఒక్కటైనా ఈ జంట మొన్న ఫస్ట్ యానివర్సరీ ని జరుపుకుంది. 

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా నేటి తరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న యువ జంట నాగ చైతన్య - సమంత. ఇరు మతాలను గౌరవించి గత ఏడాది ఒక్కటైనా ఈ జంట మొన్న ఫస్ట్ యానివర్సరీ ని జరుపుకుంది. ఇకపోతే చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించనున్నారు. 

నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ కపుల్స్ ని తనదైన శైలిలో రొమాంటిక్ గా చూపించాలని అనుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. దివ్యాన్షా కౌషిక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. రావ్ రమేష్, పోసాని కృష్ణ మురళి వంటి వారు సపోర్టింగ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. 

నాగచైతన్య - సమంత చివరగా 2014లో ఆటోనగర్ సూర్య అనే సినిమాలో నటించారు. దేవాకట్టా డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. మరి ఇప్పుడు శివ నిర్వాణ ఏ విధంగా ఈ జంటను తెరపై ప్రజెంట్ చేస్తాడో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే