నాగచైతన్య యుద్ధం శరణం విడుదల తేదీ ఇదే

Published : Aug 17, 2017, 03:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
నాగచైతన్య యుద్ధం శరణం విడుదల తేదీ ఇదే

సారాంశం

నాగచైతన్య యుద్ధం శరణం విడుదల తేదీ ఖరారు సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు నిర్మాతల సన్నాహాలు దీనిక సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

యువసామ్రాట్ నాగ చైతన్య కొత్త సినిమా యుద్ధం శరణం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. రాఖీ సందర్భంగా వచ్చిన డీసెంట్ టీజర్ తో అందరి మనసులూ గెలుచుకున్న ఈ మూవీ టీజర్ ఇప్పుడు నెట్ లో పెద్ద సంచలనమే. డైరెక్టర్ కృష్ణ ఆర్వీ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తీసినట్టు చెబుతున్నారు.

 

 

లావణ్య హీరోయిన్ గా కనిపించ బోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య నటన హై లైట్ కాబోతోంది అంటున్నారు. సెప్టెంబర్ 8 న ఈ సినిమా విడుదల కి సిద్దం అయ్యింది. ఈ డేట్ ముందరే ఇంటర్నెట్ లో వచ్చినా తాజాగా చిత్ర బృందం దీనికి ఓకే చెప్పి ఖరారు చేస్తూ పోస్టర్ లు కూడా విడుదల చేసింది. ఒక స్పెషల్ పోస్టర్ ని సైతం ఈ విడుదల చేసారు తాజాగా. సాయి కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపిస్తారు .

 

 

ఆయన ఆహార్యం స్టైల్ ఇవన్నీ ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ లు అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే చైతూ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. ఈ సినిమా తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ చేయనున్న మూవీకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే