సినిమా అవకాశం అంటూ వర్ధమాన హీరోయిన్ పై అసభ్య ప్రవర్తన

Published : Aug 17, 2017, 01:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సినిమా అవకాశం అంటూ వర్ధమాన హీరోయిన్ పై అసభ్య ప్రవర్తన

సారాంశం

వర్థమాన హీరోయిన్ పై లైంగిక దాడి షూటింగ్ పేరుతో తీసుకెళ్లి కారులోనే ఎటాక్ దర్శకుడు, హీరోలపై కేసు నమోదు

సినిమా షూటింగ్ పేరు చెప్పి హీరోయిన్ పై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13 వ తేదీన ఓ సినిమా షూటింగ్ పేరుతో హీరోయిన్ కారులోనే బయల్దేరిన దర్శకుడు చలపతి, హీరో సృజన్ లు హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించారు. హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్లాలంటూ 13వ తేదీ రాత్రి బయల్దేరారు. కారు విజయవాడ సమీపిస్తున్న సందర్భంగా.. హీరోయిన్ తో హీరో సృజన్ అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో హీరోయిన్ ప్రతిఘటించింది. కారు నెమ్మదిగా వెళ్లినా, ఆపినా హీరోయిన్ అల్లరి చేస్తుందని భావించి.. ఎక్కడ ఇరుక్కుంటామోనని.. డ్రైవింగ్ లో వున్న దర్శకుడు చలపతి.. హీరోయిన్ ఎదురు తిరగటంతో కారు వేగం పెంచాడు. నిడమానూరు వద్ద ఆగివున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.

దీంతో హీరోయిన్ గా పనిచేస్తున్న సదరు యువతి పడపట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనతో కారులో అసభ్యంగా ప్రవర్తించారని, అదేంటని అడిగినందుకు తనను ముఖంపై కొట్టి గాయపరిచారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్శకుడు చలపతిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే... యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు ప్రస్థుతం చలపతిని విడిచిపెట్టారు. కానీ.. హీరో సృజన్ మాత్రం పరారీలో వున్నాడు..

అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని, హీరోను అదుపులోకి తీసుకుని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. దర్శకుడు చలపతి కూడా కారు వేగంగా నడిపి తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని హిరోయిన్ చెప్తోంది. అయితే పోలీసులు కేవలం అతన్ని విచారించి వదిలేయటం అనుమానాలు రేకెత్తిస్తోంది.

మరోవైపు ఇలా తనతో అసభ్యంగా ప్రవర్తించి, ఘర్షణలో తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని, తన కారు కూడా లారీకి గుద్ది డ్యామేజ్ చేశారని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని హిరోయిన్ చెప్తోంది. పైగా విషయం పోలీస్ స్టేషన్ లో గాని, మరో చోట గాని చెప్తే నీ కెరీర్ నాశనం అయిపోతుందని హిరోయిన్ ను బెదిరించినట్లు చెప్తోంది. ఇలా సినిమా షూటింగ్ పేరు చెప్పి కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనలా మరే యువతికి జరగకూడదని హిరోయిన్ అంటోంది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్