Naga Chaitanya: నేను, దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి వస్తామని అనుకోలేదు.. నాగ చైతన్య కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 02, 2022, 11:38 AM IST
Naga Chaitanya: నేను, దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి వస్తామని అనుకోలేదు.. నాగ చైతన్య కామెంట్స్

సారాంశం

మలయాళీ రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల కురుప్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దుల్కర్ ఇప్పుడు ఓ రొమాంటిక్ చిత్రంతో వచ్చేస్తున్నాడు. సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హే సినామిక'.

మలయాళీ రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల కురుప్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దుల్కర్ ఇప్పుడు ఓ రొమాంటిక్ చిత్రంతో వచ్చేస్తున్నాడు. సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హే సినామిక'. మార్చి 3న గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగ చైతన్య అతిథిగా హాజరయ్యాడు. ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య ప్రసంగం ఆకట్టుకుంది. అభిమానుల కేరింతల మధ్య చైతు కూల్ గా మాట్లాడారు. దుల్కర్ సల్మాన్ పై నాగ చైతన్య ప్రశంసలు కురిపించాడు. 

చెన్నైలో ఉన్నప్పటి నుంచి దుల్కర్ తో మంచి అనుబంధం ఉందని చెప్పాడు. అప్పట్లో ఇద్దరం ఆటోమొబైల్స్ లాంటి విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇలా దుల్కర్ సల్మాన్ ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అని చైతు తెలిపాడు. 

మేమిద్దరం సినిమాల్లోకి వస్తామని అస్సలు ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇద్దరం నటులం అయినట్లు చైతు పేర్కొన్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ కి జోడిగా అదితి రావు హైదరి నటిస్తోంది. అదితి ప్రాధాన్యత ఉన్న ఎంచుకోవడం మాత్రమే కాదు.. అందులో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది అని నాగ చైతన్య ప్రశంసలు కురిపించాడు. దుల్కర్ సల్మాన్ కూడా చైతుపై ప్రశంసలు కురిపించాడు. చైతు, దుల్కర్, అదితి, బృంద మాస్టర్ వేదికపై డాన్స్ చేసి అభిమానులని అలరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్