Arjuna Kalyanam Postponed: వాయిదా పడ్డ విశ్వక్ సేన్ కళ్యాణం, ముహూర్తం కుదరలేదని...?

Published : Mar 02, 2022, 11:18 AM ISTUpdated : Mar 02, 2022, 11:31 AM IST
Arjuna Kalyanam Postponed: వాయిదా పడ్డ విశ్వక్ సేన్ కళ్యాణం, ముహూర్తం కుదరలేదని...?

సారాంశం

యంగ్ స్టార్  విశ్వక్‌సేన్‌ ఎక్స్ పెర్మెంట్స్ వైపు మళ్ళాడు. ఇండస్ట్రీలో తన మార్క్ చూపించబోతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ కు రెడీగా ఉంది.  

యంగ్ స్టార్  విశ్వక్‌సేన్‌ ఎక్స్ పెర్మెంట్స్ వైపు మళ్ళాడు. ఇండస్ట్రీలో తన మార్క్ చూపించబోతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ కు రెడీగా ఉంది.  

సినిమా సినిమాకి  క్యారెక్టర్ తో పాటు సినిమా కథల్లోనూ డిఫరెన్స్ చూపిస్తున్నాడు యంట్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్. కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి ఆడియన్స్ నుంచి అభినందననలు అందుకుంటున్నాడు.. తన సినిమాలతో ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన డిఫరెంట్ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం. రుష్కర్ దిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విద్యాసాగర్ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ టీజర్స్  కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. టీజర్ లోనే సినిమా కథని ఇండైరెక్ట్ గా చెప్పేశారు మేకర్స్. కామెడీతో పాటు  ఎమోషనల్ గా కూడా చూపించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా మార్చ్ 4 రిలీజ్ చేస్తామంటూ టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు టీమ్. అయితే ఈ సినిమాను మార్చ్ 4న రిలీజ్ చేయడంలేదంటూ నోట్ రిలీజ్ చేశారు. అర్జున కళ్యాణానికి అనుకున్న టైమ్ సరిగ్గా లేదని ముహూర్తం కుదరక సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు టీమ్.  ఇప్పటికే సమ్మర్ టార్గెట్ గా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతుండగా చిన్న సినిమాలు కూడా సమ్మర్ బరిలో నిలవడానికి పోటీ పడుతున్నాయి. అటువంటి టైమ్ లో ఈ సినిమా పోస్ట్ పోన్ అని ప్రకటించడంతో.. రిలీజ్ డేట్ ఎప్పుడిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం