నాగచైతన్య, సాయిపల్లవిల ప్రేమ కథకి ముహూర్తం కుదిరింది..

By Aithagoni RajuFirst Published Aug 18, 2021, 11:34 AM IST
Highlights

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌ స్టోరి` చిత్ర రిలీజ్‌ డేట్‌ని కన్ఫమ్‌ చేసింది యూనిట్‌. థియేటర్లో నే విడుదల చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు దర్శక, నిర్మాతలు. 

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ప్రేమ కథా చిత్రం `లవ్‌ స్టోరీ`. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్లని రూపొందించే శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. రిలీజ్‌ డేట్‌ని కన్ఫమ్‌ చేసింది యూనిట్‌. సెప్టెంబర్ 10న సినిమాని థియేటర్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు దర్శక, నిర్మాతలు. 

`పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ `లవ్ స్టోరి` కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న `లవ్ స్టోరి` థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది. `లవ్ స్టోరి` సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి.

`లవ్ స్టోరి` మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి` అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. 

''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
 

click me!