దీపికా పదుకొనె స్థానాన్ని కొట్టేసిన ప్రియాంక చోప్రా

Published : Aug 18, 2021, 09:24 AM IST
దీపికా పదుకొనె స్థానాన్ని కొట్టేసిన ప్రియాంక చోప్రా

సారాంశం

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. మరోసారి ఆమె బాలీవుడ్‌ సినిమా చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు ప్రతిష్టాత్మక `మామి` ఛైర్‌ పర్సన్‌గా ఎంపికయ్యారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె స్థానాన్ని గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా దక్కించుకుంది. ముంబై ఆకాడ‌మీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్‌(మామి)కి దీపికా ప‌దుకోన్ చైర్ ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. నాలుగు నెల‌ల క్రిత‌మే ఈ ప‌ద‌వి నుంచి దీపికా ప‌దుకోన్ త‌ప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో ప్రియాంకని ఎంపిక చేశారు. మామి చైర్‌ పర్సన్‌గా ప్రియాంకకి అవకాశం ఇచ్చారు.

మామి బోర్డు స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నీతా అంబానీ, అనుప‌మ చోప్రా, ఆనంద్ జీ మ‌హీంద్రా, అజ‌య్ బిజ్లీ, ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ఇషా అంబానీ, కిర‌ణ్ రావు, రానా ద‌గ్గుబాటి, క‌బీర్‌ఖాన్‌, కౌస్తుబ్ ధావ్సే, రితేశ్ దేశ్‌ముఖ్‌, రోహ‌న్ సిప్పి, జోయా అక్త‌ర్‌, విశాల్ భ‌ర‌ద్వాజ్‌, విక్ర‌మాదిత్య మోత్వానే, సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ క‌లిసి త‌దుప‌రి చైర్ ప‌ర్స‌న్‌గా ప్రియాంక చోప్రాను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. 

మామి స‌భ్యుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని, చైర్ ప‌ర్స‌న్‌గా ఎన్నిక కావ‌డం ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపారు. 2021 అక్టోబ‌ర్ నుంచి 2022 మార్చి వ‌ర‌కు జ‌ర‌గ‌బోయే మామి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ‌తాన‌ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 

ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యు` చిత్రాలు చేస్తుంది. ఇక బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తూ అలియా భట్‌, కత్రినా కైఫ్‌లతో కలిసి `జీ లే జారా` చిత్రంలో నటిస్తుంది. ఇది పూర్తిగా ఫీమేల్‌ మల్టీస్టారర్‌గా ఉండబోతుందట. ఫర్హాన్‌ అక్తర్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి