మరో వివాదంలో దాసరి అరుణ్‌.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..

Published : Aug 18, 2021, 09:28 AM ISTUpdated : Aug 18, 2021, 10:47 AM IST
మరో వివాదంలో దాసరి అరుణ్‌..  ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు..

సారాంశం

దాసరి అరుణ్‌పై మరో కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. 

దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే ఆస్తుల విషయంలో అన్న ప్రభుతో ఆయనకు మధ్య వివాదాలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది. తనని కులం పేరుతో దూషించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 సెక్షన్ల కింద ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. 

దీనిపై పోలీసులు చెబుతూ, బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెన్నీషియన్‌ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ పనులు చూసేవారట. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌కి బాగా పరిచయం. 2018 నవంబర్‌ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్‌ చెప్పారు. 

ఇదే విషయంపై ఈ నెల 13, రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీకి రమ్మని అరుణ్‌ చెప్పగా, చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకుని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్‌ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..