హనీమూన్ కన్నా.. షూటింగే ముఖ్యమంటున్న నాగచైతన్య

Published : Oct 03, 2017, 02:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
హనీమూన్ కన్నా.. షూటింగే ముఖ్యమంటున్న నాగచైతన్య

సారాంశం

వివాహ బంధంతో ఒక్కటౌతున్న నాగచైతన్య, సమంత వివాహం అనంతరం షూటింగ్ లో పాల్గొననున్న చైతు, సామ్ జనవరి మొదటివారంలో హనీమూన్ కి వెళ్లనున్నట్లు సమాచారం

ఇంతకాలం ప్రేమలో మునిగి తేలిన నాగచైతన్య, సమంతలు మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. అక్టోబర్ 6,7వ తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం గోవాలో జరగనుంది. పెళ్లి జరిగిన వెంటనే.. వీరిద్దరూ హనీమూన్ కి చెక్కేస్తారంటూ.. గత కొంతకాలంగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

 

అయితే.. ఈ వార్తలపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. హనీమూన్ కంటే ప్రొఫెషన్ కే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వివాహం అనంతం తామిద్దరూ తమ సినిమా షూటింగ్ లలో పాల్గొంటామని చైతు చెప్పాడు. ప్రస్తుతం సమంత.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985లో కథానాయిక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా నాగచైతన్య కూడా చందు మొండేటి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సవ్యసాచి చిత్ర షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కనుక వీరిద్దరూ తమ షూటింగ్ల్ లలో బిజీ కానున్నారు.

 

ఈ రెండు ప్రాజెక్టులను సమంత, చైతన్యలు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసుకోనున్నారట. ఆ సినిమాల షూటింగ్ ముగించుకొని.. డిసెంబర్ చివరి వారంలోగానీ, జనవరి మొదటి వారంలో గానీ హనీమూన్ కి చెక్కేయనున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌