బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా

By tirumala ANFirst Published Oct 3, 2024, 7:42 AM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నెలరోజులు పైనే అవుతోంది. క్రమంగా హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దీనితో ప్రేక్షకులు తమకి నచ్చిన కంటెస్టెంట్స్ లకు సపోర్ట్ గా ఓటింగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నెలరోజులు పైనే అవుతోంది. క్రమంగా హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దీనితో ప్రేక్షకులు తమకి నచ్చిన కంటెస్టెంట్స్ లకు సపోర్ట్ గా ఓటింగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. హౌస్ లో నబీల్, యాష్మి, నైనికా, మణికంఠ, నిఖిల్ హైలైట్ అవుతున్నారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనికా పెర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. 

బిగ్ బాస్ తెలుగు 8లో అన్ లిమిటెడ్ ట్విస్టులు 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ట్విస్టులు టర్న్ లు అన్ లిమిటెడ్ గా ఉంటాయని బిగినింగ్ లోనే నాగార్జున మాట ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే హౌస్ లో పరిణామాలు జరిగుతున్నాయి. త్వరలో బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి. బిగ్ బాస్ కూడా దీని గురించి చెబుతున్నారు. అదే విధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని నాగార్జున బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు శనివారం రోజు రెగ్యులర్ ఎలిమినేషన్ జరగనుంది. 

Latest Videos

ప్రస్తుతం హౌస్ లో 6 గురు సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, నబీల్, మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనికా ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నారు. సాధారణంగా అయితే ఈ ఆరుగురిలో వీకెండ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి గురువారం రోజు ఒకరు.. శనివారం రోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. గురువారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ ఆల్రెడీ ముగిసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. 

డేంజర్ జోన్ లో ఆదిత్య ఓం, నైనికా 

నిఖిల్ నబీల్ ఇద్దరూ 25 శాతానికి పైగా ఓట్లతో అగ్ర స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరూ పూర్తిగా సేఫ్. ఇక నాగ మణికంఠకి కూడా బాగానే ఓట్లు వస్తున్నాయి. అతడికి 18 శాతం ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. కాబట్టి అతడికి కూడా ఢోకా లేదు. నాల్గవ స్థానంలో 14 శాతం ఓట్లతో ఉన్నారు. విష్ణుప్రియ పాపులారిటీకి ఆమెకి వాస్తున్న సపోర్ట్ తక్కువే. కానీ ఆమె ప్రస్తుతానికి సేఫ్. ఇక చివరి స్థానాల్లో ఆదిత్య 9 శాతం ఓట్లతో, నైనికా 5 శాతం ఓట్లతో ఉన్నారు. కాబట్టి బాటమ్ లో ఉన్న నైనికా, ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఖరారు అయింది. 

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం అవుట్ ?

మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనికా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి.. శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం. ఆదిత్య ఓం హౌస్ లో హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. కానీ అతడి పెర్ఫామెన్స్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. తెలుగు మాట్లాడడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఏదో చేయాలి కాబట్టి హంగామా చేస్తున్నాడు. 

త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 

కొన్నిసార్లు హౌస్ మేట్స్ సంధించే ప్రశ్నలకు అతడి వద్ద సరైన కౌంటర్ లేకుండా పోతోంది. నెలరోజులకే అతడు ఎలిమినేట్ అవుతుండడం షాకింగ్ గా మారింది. మొత్తంగా ఈ వారం రెండు ఎలిమినేషన్స్ తో ఇద్దరు సభ్యులు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడు దిగుతారో చూడాలి. ఆల్రెడీ ఈ సీజన్ లో అసలు గుర్తింపు లేని కంటెస్టెంట్స్ ని తీసుకువచ్చారనే విమర్శ ఉంది. యాడదొరికిన సంత వీళ్లంతా.. మొత్తం కనడ బ్యాచ్ ని తీసుకువచ్చారు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. 

నిఖిల్, నబీల్ ఇద్దరూ టైటిల్ రేసులో ఉన్నారంటూ నెటిజన్లు ఆల్రెడీ పోస్ట్ లు పెడుతున్నారు. యాష్మి, ప్రేరణ మాత్రం మామూలు హంగామా చేయడం లేదు. దీనికి తోడు యాష్మి, మణికంఠ మధ్య టామ్ అండ్ జెర్రీ  ఫైట్ సాగుతోంది. 

click me!