Naga Chaitanya: భరించలేకపోతున్న నాగ చైతన్య ఫ్యాన్స్.. ఇలా జరిగిందేంటి..

Published : May 30, 2022, 12:31 PM IST
Naga Chaitanya: భరించలేకపోతున్న నాగ చైతన్య ఫ్యాన్స్.. ఇలా జరిగిందేంటి..

సారాంశం

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. 

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక అక్కినేని అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న అంశం ఏంటంటే.. చైతు బాలీవుడ్ ఎంట్రీ. 

అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య చిన్న రోల్ లో నటిస్తున్నాడు. కానీ ఈ చిత్రంపై చై ఫ్యాన్స్ బోలెడు ఆశలే పెట్టుకున్నారు. అమీర్ ఖాన్ తో కలసి చైతు ఈ చిత్రంలో సైనికుడిగా నటిస్తున్నాడు. 

దీనితో చైతు రోల్ పవర్ ఫుల్ గా ఉండబోతోందని.. బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా తర్వాత నాగ చైతన్యకి క్రేజ్ గ్యారెంటీ అని అక్కినేని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఇటీవల ట్రైలర్ చూస్తే మాత్రం చై ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ తప్పదు. ఒకటి రెండు షాట్స్ లో తప్ప చైతు కనిపించడు. అది కూడా హీరోయిక్ గా ఎలాంటి ఎలివేషన్ లేదు. 

చిన్న పిల్లల చేష్టలు.. అల్లరి అల్లరిగా కనిపించడం అమీర్ ఖాన్ కు సెట్ అవుతుంది కానీ.. ఆ తరహా రోల్ లో చైని ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు. సైనికుడు అయినప్పటికీ అమీర్ ఖాన్ తో ఇన్నర్ వేర్స్ గురించి జోకులు వేసుకుంటూ.. చై ఫన్నీగా కనిపిస్తున్నాడు. 

ట్రైలర్ లో అయితే ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విధంగానే చై రోల్ ఉంది. మరి సినిమాలో అయినా కనగా చైత్యన్యకి పవర్ ఫుల్ సీన్స్ పడ్డాయో లేదో చూడాలి. ఆగష్టు 11న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్  చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..