
వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ "ఎఫ్2" సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్3" విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ లు హీరయిన్లుగా నటించారు. రఘుబాబు, ప్రగతి, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఒక సరికొత్త స్టోరీ లైన్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 27 న థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే మొదటి రోజు డివైడ్ టాక్ ను అందుకుంది. రివ్యూలు అటూ ఇటూగా వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆదరించటంతో ఈ సినిమా ఈ వీకెండ్ లో దుమ్ము దులిపింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వీకెండ్ లో ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. అయితే, ఇది బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2కి సీక్వెల్ కావడంతో ట్రేడ్ పండితులు ఇంకా పెద్ద అంకెలు అంచనా వేశారు. కానీ వాటిని రీచ్ కావటం లేదు.
తెలంగాణ కంటే ఆంధ్రాలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం బాగానే వర్కవుట్ అయ్యింది. USA లో ఇది సుమారు $1 మిలియన్ (రూ. 7.7 కోట్ల గ్రాస్) వసూలు చేసింది, ఇది మంచి కలెక్షనే. ‘ఎఫ్3’ ఫస్ట్ వీకెండ్ పరీక్ష పాసైంది. వారం రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తే రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయం.
ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ అయిన "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాలు చూస్తే యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా హిట్ అవడానికి కలిసి వచ్చాయి. "ఆర్ ఆర్ ఆర్" ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటి సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక "కే జి ఎఫ్ 2" లో హీరో ఎలివేషన్ లు మరియు యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఎలిమెంట్లు ఏమీ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే సెల్లింగ్ పాయింట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "ఎఫ్ 3". అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పాలి.
మరో ప్రక్క రిలీజ్ కు ముందు `సాధారణ టికెట్ రేట్లకే సినిమా` అంటూ మిడిల్ క్లాస్ ప్రేక్షకుల్ని థియేటర్లవైపు రప్పించడానికి దిల్ రాజు ఆల్రెడీ ప్రకటన చేసారు.అదే కలిసొచ్చిందంటున్నారు. ఈ సినిమా మౌత్ టాక్ ని బట్టి... రెస్పాన్స్‌ని బట్టి, ప్రేక్షకుల మ్యాట్నీ నుంచి పికప్ అయ్యిందని సమాచారం. ``ఎఫ్ 3 మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ సినిమా. కుటుంబ ప్రేక్షకులే ఈ సినిమాకి బలం. వాళ్లు మౌత్ టాక్ ని బట్టే థియేటర్లకు వస్తారు. శని, ఆదివారాల నుంచి... థియేటర్లు నిండుతాయి`` అని లెక్కలు వేస్తున్నారు.
ఇక ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' ఐటమ్ సాంగ్ లో పూజ మెరిసింది. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆమె అంగీకరించింది. 'ఎఫ్ 3' సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె సందడి చేయటం కలిసి వచ్చిందని అంటున్నారు.