Virata Parvam: 'విరాటపర్వం' ప్రీపోన్ !, కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే?

By Surya Prakash  |  First Published May 30, 2022, 10:01 AM IST

సినీ ప్రియులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న విరాటపర్వం సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 



  దగ్గుబాటి రానా.. సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా  రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సరైన సమయం కుదరలేదనే చెప్పుకోవాలి. ఆ మధ్యన విరాట పర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనా పరిస్దితులు కాస్త చక్కపడ్డాక... విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినీ ప్రియులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న విరాటపర్వం సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే  మొద‌ట‌గా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మీడియా వర్గాల సమాచారం.
 
లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రాన్ని జూన్‌17న ఈ చిత్రం విడుద‌ల కానుందని సమాచారం. ఇక దీనిపై చిత్ర‌ టీమ్  నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయగా.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇందులో రానా.. కామ్రేడ్ రావన్న పాత్రలో నటిస్తుండగా.. అతడి కవితలు చదివి అతడి ప్రేమ కోసం వెళ్లే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించగా.. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Latest Videos

click me!