
చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తమిళ నటుడు DMDk అధినేత విజయ్ కాంత్. చాలా సార్లు ఆయనకు సీరియస్ అయ్యింది.. ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇక గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయిన విజయ్ కాంత్.. నడవడానికి కూడా వీలు లేకపోవడంతో.. వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ఈక్రమంలో ఆయన మరోసారి అనారోగ్యం పాలు అయ్యి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత పది రోజులుగా మయత్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు విజయ్ కాంత్.
ఈ క్రమంలో విజయకాంత్ చనిపోయారనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో. జలుబు, జ్వరంతో హాస్పిటల్ లో చేరిన ఆయన..సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. దాదాపు 10 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. దాంతో విజయ్ కాంత్ చనిపోయారని వందంతులువ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత ఈ విషయంలో స్పందిచారు... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.
ఇక విజయ్ కాంత్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మరోవైపు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమన్యం బులెటిన్ విడుదల చేసింది. విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని... అయితే, గత 24 గంటల నుంచి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒక రకంగా విజయ్ కాంత్ కు బాగా సీరియస్ గా ఉందని.. చెప్పకనే చెప్పారు.
ఇక మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టువారు వెల్లడించారు. ఈక్రమంలో తెలిపారు. మరోవైపు డీఎండీకే పార్టీ కూడా విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసింది. సాధారణ వైద్య పరీక్షల కోసమే విజయకాంత్ ఆసుపత్రిలో చేరారని... ఒకట్రెండు రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వస్తారని తెలిపింది. ఆయనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని విన్నవించింది.