'కస్టడీ' షూటింగ్ పూర్తి.. ఫస్ట్ టైమ్ నాగ చైతన్యని ఇలా చూస్తుంటే, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. 

Published : Feb 24, 2023, 07:51 PM IST
'కస్టడీ' షూటింగ్ పూర్తి.. ఫస్ట్ టైమ్ నాగ చైతన్యని ఇలా చూస్తుంటే, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. 

సారాంశం

వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు, చైతు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. 

2022లో నాగ చైతన్యకి మిక్స్డ్ రిజల్ట్స్ లభించాయి. బంగార్రాజు విజయం సాధించగా.. లాల్ సింగ్ చద్దా, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక 2023లో నాగ చైతన్య ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు, చైతు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. 

నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్ గా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఫైనల్ షాట్ ఫినిష్ చేస్తున్న దృశ్యాలని నాగ చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దర్శకుడు వెంకట్ ప్రభు ఫైనల్ షాట్ కి కట్ చెబుతూ.. చై ఇక నువ్వు కస్టడీ నుంచి రిలీజ్ అని అంటున్నారు. 

నాగ చైతన్య ఫుల్ జోష్ లో కనిపిస్తూ.. మే 12న మీ అందరిని కస్టడీలోకి తీసుకోబోతున్నాం అని చెబుతున్నాడు. నాగ చైతన్య ఇంత హ్యాపీగా ఉండడం, ఫుల్ జోష్ లో కనిపించడం చాలా రోజుల తర్వాత ఇదే తొలిసారి. చైతుని ఇలా చూస్తుంటే సంతోషం ఆగడం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చివరగా వెంకట్ ప్రభు శింబుతో మానాడు అనే చిత్రం తెరకెక్కించారు. టైం లూప్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. మరి ఈ చిత్రంలో వెంకట్ ప్రభు ఎలాంటి కథాంశం ఎంచుకున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు