శ్రీదేవిపై నా ప్రేమని మొదటి భార్యకి చెప్పా.. ఆమె నన్ను ఎందుకు ప్రేమించింది అంటే, బోనీ కపూర్ కామెంట్స్ 

Published : Feb 24, 2023, 06:22 PM IST
శ్రీదేవిపై నా ప్రేమని మొదటి భార్యకి చెప్పా.. ఆమె నన్ను ఎందుకు ప్రేమించింది అంటే, బోనీ కపూర్ కామెంట్స్ 

సారాంశం

నేడు అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిన రోజు. 2018లో ఇదే రోజున శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ లో అనుమానాస్పదంగా బాత్ టబ్ లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే.

నేడు అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిన రోజు. 2018లో ఇదే రోజున శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ లో అనుమానాస్పదంగా బాత్ టబ్ లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. సౌత్ లో మొదలైన శ్రీదేవి హవా ఆ తర్వాత బాలీవుడ్ లో తిరుగులేని విధంగా సాగింది. నిర్మాతలకు కాసుల పంట పండించే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ లక్కీ నిర్మాతలలో బోనీ కపూర్ కూడా ఒకరు. 

నేడు శ్రీదేవి వర్థంతి కావడంతో బోనీ కపూర్ తన భార్య మెమొరబుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ప్రేమ గురించి వివరించారు. శ్రీదేవిని బోనీ కపూర్ మొదట ఓ తమిళ చిత్రంలో చూశారట. ఆమెతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీదేవిని ఎలాగోలా కలిశా. ఆమెతో తొలిసారి మాట్లాడగానే ఇంకా బాగా నచ్చేసింది. 

ఆ తర్వాత శ్రీదేవి తల్లిని కలిసి ఆమెతో సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పా. శ్రీదేవి రెమ్యునరేషన్ 8 లక్షలు అయితే ఆమె తల్లి రూ 10 లక్షలు డిమాండ్ చేసింది. మొదట నేను కుదరదని చెప్పా. కానీ ఆ తర్వాత రూ 11 లక్షలు ఇచ్చి సర్ప్రైజ్ చేశా. శ్రీదేవితో షూటింగ్స్ కి తిరిగేవాడిని అలా ఆమె ప్రేమలో పడ్డా. అప్పటికే నాకు పెళ్లయింది. శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ ని మొదటి భార్యకు కూడా చెప్పా. 

శ్రీదేవితో ఉంటూ ఆమె పట్ల ఎంతో కేర్ తీసుకునేవాడిని. అందుకే శ్రీదేవి కూడా తిరిగి నన్ను ప్రేమించింది. ఆ విధంగా బోనీ కపూర్ శ్రీదేవిని బుట్టలో వేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. బోనీ కపూర్ కి మొదటి భార్య ద్వారా అర్జున్ కపూర్, అన్షుల కపూర్ పిల్లలు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?