భారీ రేట్‌కి `ఏజెంట్‌` థియేట్రికల్‌ రైట్స్.. అఖిల్‌ పై పెరుగుతున్న ప్రెజర్‌

Published : Feb 24, 2023, 06:52 PM ISTUpdated : Feb 24, 2023, 07:04 PM IST
భారీ రేట్‌కి `ఏజెంట్‌` థియేట్రికల్‌ రైట్స్.. అఖిల్‌ పై పెరుగుతున్న ప్రెజర్‌

సారాంశం

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన `ఏజెంట్‌` చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోవడం విశేషం.

హీరో అఖిల్‌ అక్కినేనికి ఇప్పటి వరకు హిట్‌ పడలేడు. చివరగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఉన్నంతలో బెటర్‌ అనిపించుకుంది. కానీ సరైన బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు అఖిల్‌. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా మూవీతో వస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్‌` సినిమా చేస్తున్నాడు. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌ కి జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న చిత్రమిది. 

సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం భారీ యాక్షన్‌, ఛేజింగ్‌ సీన్లని షూటింగ్‌ చేసేందుకు విదేశాలకు వెళ్తున్నారు. ఇక సినిమా ఏప్రిల్‌ 28న విడుదల కాబోతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ఈ సినిమా సుమారు ఎనభై కోట్లు ఖర్చు అయ్యిందట. భారీ యాక్షన్‌ ఎపిసోడ్ల కారణంగా బడ్జెట్‌ పెరిగిందని తెలుస్తుంది. అఖిల్ పై ఇంత బడ్జెట్‌ అంటే పెద్ద రిస్కే. అది రికవరీ అతవుతుందా అనేది సమస్య. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. ఉగ్రవాదులు బిన్‌ లాడెన్‌, గడాఫి పంపారంటూ అఖిల్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. 

దీనికితోడు ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమా విడుదల కానుంది. సినిమా హిట్‌ అయితే ఈ కలెక్షన్లు పెద్ద లెక్క కాదు, కానీ తేడా కొడితేనే ఏంటనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయాయట. వైజాగ్‌కి చెందిన గాయత్రి ఫిల్మ్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక హక్కులను సొంతం చేసుకున్నారట. రూ.34కోట్లకు ఈ మూడు రాష్ట్రాల థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. 

థియేట్రికల్‌ రైట్స్ పరంగా ఓ సగం బడ్జెట్‌ వచ్చింది. ఓటీటీ, శాటిలైట్‌ ద్వారా మరికొంత వస్తుంది. ఆల్మోస్ట్ 70శాతం రికవరీ ఈ మూడు రైట్స్ లో అవుతుంది. మిగిలిన 30 శాతం ఇది థియేటర్ ద్వారానే రాబట్టుకోవాలి. అంటే ఈ సినిమా కనీసం డెబై కోట్లయినా రాబట్టాలి. అప్పుడే అటు కొన్ని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత సేఫ్‌లో ఉంటారు. లేదంటే ఘోరంగా నష్టపోవాల్సి వస్తుంది. మరి ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?